Home జాతీయ వార్తలు బిట్‌కాయిన్‌ను క‌రెన్సీగా గుర్తించ‌డంలేదు: కేంద్ర ఆర్థిక‌శాఖ‌

బిట్‌కాయిన్‌ను క‌రెన్సీగా గుర్తించ‌డంలేదు: కేంద్ర ఆర్థిక‌శాఖ‌

231
0

న్యూఢిల్లీ నవంబర్ 29
క్రిప్టోక‌రెన్సీపై కేంద్రం ఓ ప్ర‌క‌ట‌న చేసింది. దేశంలో బిట్‌కాయిన్‌ను క‌రెన్సీగా గుర్తించేందుకు ఎటువంటి ప్ర‌తిపాద‌న లేద‌ని ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ‌శాఖ తెలిపింది. లోక్‌స‌భ‌లో లిఖిత‌పూర్వ‌క స‌మాధానం ఇచ్చిన మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. బిట్‌కాయిన్ లావాదేవీల‌కు చెందిన డేటాను ప్ర‌భుత్వం సేక‌రించ‌డంలేద‌న్నారు. అయితే ఈ శీతాకాల పార్ల‌మెంట్ స‌మావేశాల్లో క్రిప్టో బిల్లును ప్ర‌వేశ‌పెట్టాల‌ని కేంద్రం యోచిస్తున్న‌ది. బిట్‌కాయిన్ లావాదేవీల నియంత్ర‌ణ కోసం రెగ్యులేట‌రీ వ్య‌వ‌స్థ అవ‌స‌రం అన్న అభిప్రాయాన్ని ఇటీవ‌ల కేంద్రం వ్య‌క్తం చేసింది. అయితే బ్యాంక్ నోటు అన్న నిర్వ‌చ‌నాన్ని మారుస్తూ, దాంట్లో డిజిట‌ల్ క‌రెన్సీని కూడా జోడించే విధంగా ఆర్బీఐ చ‌ట్టాన్ని స‌వ‌రించాల‌ని ఇటీవ‌ల కేంద్రాన్ని ఆర్బీఐ కోరిన విష‌యం తెలిసిందే.

Previous articleవివేకా కూతురు బెదిరిస్తోంది
Next articleకొంత ఓపికతో ఉందండి సమస్యలను పరిష్కరిస్తాం ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు మంత్రి బొత్స విజ్ఞప్తి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here