న్యూ ఢిల్లీ అక్టోబర్ 16
క్రిప్టో కరెన్సీ మేజర్ బిట్ కాయిన్ ఆరు నెలల్లో తొలిసారి 60 వేల డాలర్ల మార్క్‌ను దాటింది. గత ఏప్రిల్ 17న బిట్ కాయిన్ ఆల్‌టైం రికార్డుతో 64,895 డాలర్లను తాకింది. ఆ తర్వాత గరిష్ఠ స్థాయిలో బిట్ కాయిన్ విలువ పెరగడం ఇదే తొలిసారి. నాటి నుంచి క్రిప్టో మేజర్ 4.5 శాతం వృద్ధి చెంది, తాజాగా 59,290 డాలర్లకు చేరుతుంది. బిట్ కాయిన్‌ను ఫ్యూచర్ ఆధారిత ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)లో ట్రేడింగ్‌లో అనుమతి ఇస్తున్నట్లు అమెరికా రెగ్యులేటర్లు చెప్పారు.దీంతో డిజిటల్ అసెట్స్‌లో విస్తృత స్థాయిలో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. బిట్ కాయిన్‌కు యూఎస్ఈటీఎఫ్‌లో బిట్ కాయిన్ ట్రేడింగ్ కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చేవారం బిట్ కాయిన్ ట్రేడింగ్‌ను అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (యూఎస్ఎస్ఈసీ) అనుమతి ఇస్తుందని భావిస్తున్నారు.