బద్వేల్
ఉప ఎన్నికల పోలింగ్కు కేవలం పదిరోజుల మాత్రమే ఉంది పోలింగుకు సమయం తక్కువగా ఉండడంతో కాంగ్రెస్ బిజెపి పార్టీలు తమ ప్రచారం మరింత ముమ్మరం చేశాయి ఇప్పటికే వైకాపా తరపున రాష్ట్ర మంత్రులతో పాటు కడప అనంతపురం చిత్తూరు నెల్లూరు జిల్లాలకు చెందిన వైకాపా ఎమ్మెల్యేలు ఆ పార్టీ ముఖ్య నేతలు గత 20 రోజులుగా బద్వేలులో మకాం వేసి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు ఈ నేపథ్యంలో బిజెపి అభ్యర్థి సురేష్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కమలమ్మ తరపున ఆయా పార్టీల అగ్రనేతలు గత మూడు రోజులుగా నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఎడతెరిపి లేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు వారు చేస్తున్న ప్రచారానికి ప్రజల నుండి మంచి ఆదరణ వస్తుంది ఒక విధంగా చెప్పాలంటే వైకాపాకు కాంగ్రెస్ బిజెపి పార్టీలు గట్టి పోటీ ఇస్తున్నాయి బిజెపి కాంగ్రెస్ పార్టీల ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీ నేతలతో మంతనాలు చేస్తున్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆ పార్టీ ఎంపీ రమేష్ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి దేశం నాయకులతో టచ్ లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బిజెపికి మద్దతు ఇస్తున్నారని ఇప్పటికే ఆ పార్టీ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బహిరంగంగా చెప్పడం జరిగింది పోలింగ్ తేదీ దగ్గర పడడంతో మూడు పార్టీలు ఎన్నికల ప్రచార జోరు పెంచాయి ఉప ఎన్నికల్లో త్రిముఖ పోరు రసవత్తరంగా ఉంది ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు పార్టీలు జన సమీకరణకు నానా తంటాలు పడుతున్నాయి వైకాపా నాయకులు తమ వెంట ఎక్కువ జనాన్ని తీసుకు వెళ్లేందుకు అనేక ప్రయాసలు పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కమలమ్మ కుటుంబ సమేతంగా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వల్లి నాయకత్వంలో ముమ్మరంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది పిసిసి అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ ఏడు మండలాలను పర్యవేక్షిస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ ఆమె భర్త పి సి సి ఉపాధ్యక్షుడు ప్రభాకర్ కుమారుడు కమల్ ప్రభాస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు ఇప్పటికే కమలమ్మ బద్వేలు పోరుమామిళ్ల కలసపాడు కాశి నాయన మండలాల్లో ప్రచారం చేశారు కొన్నిచోట్ల కమలమ్మ కు మద్దతుగా ప్రభాకర్ కమల్ ప్రభాస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వెంటబెట్టుకొని ప్రచారం చేస్తున్నారు 2019 ఎన్నికల్లో బద్వేల్ కాంగ్రెస్ అభ్యర్థిగా కమల్ ప్రభాస్ పోటీ చేయడం జరిగింది పద్యాలు బద్వేలు ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పోటీలో లేకపోవడంతో వారి ఓట్లను తమ వైపు తిప్పుకోవడానికి బిజెపి నేతలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగా కాశి నాయన మండలానికి చెందిన తెలుగుదేశం నాయకుడు కర్నాటి వెంకట్ రెడ్డి తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎంపీ రమేష్ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి చర్చలు జరిపారు దీనిపై పార్టీ పెద్దలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం నాయకుడు వెంకట్ రెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది ఇతర మండలాలకు చెందిన తెలుగుదేశం నాయకులతో బిజెపి అగ్ర నాయకులు ఫోన్ల ద్వారా మంతనాలు చేస్తున్నట్లు సమాచారం ఇప్పటికే కాశినాయన మండలం లో వైకాపా అసమ్మతి నేతలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు బి.కోడూరు మండలాలకు చెందిన వైకాపా ముఖ్య నాయకుడు ఒకరు బిజెపిలో చేరేందుకు చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది ఈ చర్చలు దాదాపు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది ఉప ఎన్నికల్లో వైకాపా బిజెపి కాంగ్రెస్ పార్టీలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నాయి ఈ మూడు పార్టీలు ఒకపక్క ప్రచారాలు చేస్తూనే మరోపక్క తెరవెనుక పకడ్బందీ వ్యూహాలు చేస్తున్నాయి పోరుమామిళ్ల మండలంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆ పార్టీ ముఖ్య నేతలు మంగళవారం ఉద్ధృతంగా ఎన్నికల ప్రచారం చేశారు