కామారెడ్డి నవంబర్ 11
కామారెడ్డి జిల్లా పరిధిలోని అన్ని మండలాలలో వడ్ల కొనుగోలు త్వరిత గతిన పూర్తి చేయాలని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్క రించాలని, యాసంగి పంట కొనుగోలు గురించి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో కామారెడ్డి బిజెపి జిల్లా అధ్యక్షులు అరుణతారా, జిల్లా మోర్చా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జ్ కాటేపల్లి వెంకట రమణ రెడ్డి, జిల్లా సెక్రెటరీ కే. సరోజ, రాష్ట్ర నాయకులు , ఎంజీ వేణుగోపాల్ గౌడ్ , నీలం చిన్న రాజులు, ఎస్ సి సెల్ అధ్యక్షులు బాలరాజ్ , మండల అధ్యక్షులు ప్రదీప్ రావు, నాయకులు డాక్టర్ సిద్దారాములు, నిట్టు చిన్న గంగాధర్ రావు, కౌడిగారి శ్యామ్ రావు, తుమ్మ బాలకిషన్, ఆకుల బాస్కర్, డాక్టర్ కె. వీరేశం మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు
నాయకులు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.