అమరావతి
ఏపీ బీజేపీ నేతలు గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ను కలిశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కొత్త సభ్యుల నియామకంలో ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా బీజేపీ ఫిర్యాదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా టీటీడీ పాలకమండలిని నియమించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తరువాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ టీటీడీ లో జంబో బోర్డ్ ను మేము వ్యతిరేకిస్తున్నాం. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రభుత్వ తీరు ఉంది. ప్రత్ర్యక ఆహ్వానితుల పేరుతో అన్ని సౌకర్యాలు ఇచ్చి బోర్డ్ లో పెట్టారని అన్నారు. భక్తుల సౌకర్యాలకు ఇబ్బంది కలుగుతుంది అని గవర్నర్ కు చెప్పాం. హిందూ మనోభావాలకు విరుద్దాం జరుగుతున్న అంశాలను బీజేపీ ప్రశ్నిస్తుంది. ఎవరు లేఖలు ఇచ్చినా పార్టీ కి సంబంధం లేదు. నడ్డా లేఖ ఇస్తే బీజేపీ ఇచ్చినట్లు….నేతలు ఇస్తే బీజేపీ ఇచ్చినట్లు కాదు. మొత్తం లిస్ట్ వ్యవహారం మీదనే దర్యాప్తు చెయ్యండి అని గవర్నర్ మీద కోరాం. క్రిమినల్స్ పేర్లు కూడా టీటీడీ లిస్ట్ లో ఉన్నాయని అయన ఆరోపించారు.