నెల్లూరు
కాలుష్య నివారణ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నగరంలోని పలు రేషన్ దుకాణాల వద్ద బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో గుడ్డ సంచులు పంపిణీ కార్యక్రమం బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవ సమర్పణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు , మహిళ అధ్యక్షులు నిర్మలా కిషోర్ మరియు జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్ యాదవ్, మహిళ అధ్యక్షులు రాజేశ్వరి కందికట్ల పిలుపు మేరకు ఉపాధ్యక్షులు గంట విజయశ్రీ ఆధ్వర్యంలో రేషన్ షాపులను సందర్శించారు. ఈ సందర్భంగా వినియోగ దారులకు సంచులను పంచి,స్థానికంగా వున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు . భారతదేశ ప్రధాని నరేంద్రమోడీ మనిషికి 5 కేజీల బియ్యం అందుతున్నాయ లేదా అని చూడడం జరిగిందన్నారు. ముఖ్యంగా సర్వర్లు సరిగ్గా పని చేయడం లేదని సోషల్ మీడియా పరంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది.ఈకార్యక్రమంలో పాల్గొన్నవారు రాజేశ్వరి కండికట్ల ,గంట విజయశ్రీ, కరణం సుభాషిణి, మండలాధ్యక్షులు లక్ష్మమ్మ, ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి లక్ష్మి,ఎన్. లత , పి. లక్ష్మి, మధుబాల, కల్పన, అనిత, రాధమ్మ,జ్యోతి, నాగలక్ష్మి, చంద్రమ్మ, పద్మ,అమరేశ్వరి, ఈశ్వరి, శ్రీనివాసులు, శ్రీకాంత్,తదితరులు పాల్గొన్నారు.