Home తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర చీఫ్.. బండి సంజయ్ ఫైర్

ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర చీఫ్.. బండి సంజయ్ ఫైర్

107
0

హైదరాబాద్ నవంబర్ 30
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై  బీజేపీ రాష్ట్ర చీఫ్.. బండి సంజయ్ ఫైరయ్యారు. అయితే.. ఇప్పుడు మాత్రం.. వ్యాఖ్యలు లేకుండా.. పాయింట్ వైజ్గా కౌంటర్ ఇచ్చారు. రైతులకు అండగా ఉండాల్సిన సీఎం కేసీఆర్… రైసు మిల్లర్లకు అండగా ఉంటున్నారని ఆరోపించారు. కేంద్రం రా రైసు కొంటుందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పష్టంగా చెప్పారన్న సంజయ్… సీఎం మళ్లీ కొంటారా? అని ప్రశ్నించడం దేనికని అన్నారు.సీఎం కేసీఆర్ భాష జుగుప్సాకరంగా ఉందన్నారు. సీఎం వాడే భాష తెలంగాణలో ఎవరైనా మాట్లాడతారా? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిని దద్దమ్మ అని తిట్టొచ్చా? అని ప్రశ్నించారు. కేసీఆర్కు భయపడి మంత్రులు సమర్థిస్తున్నారేమో కానీ… ప్రజలు అలాంటి భాషను సహించరని తెలిపారు. కేబినెట్ సమావేశంలో.. ఎవరిని ఎలా తిట్టాలనే విషయంపైనే కేసీఆర్ ట్రైనింగ్ ఇచ్చి ఉంటారని మంత్రివర్గంలో చర్చించి ఉంటారని ఎద్దేవా చేశారు. రా రైసు కొంటామని కేంద్రం చెప్తోందన్న సంజయ్… ధాన్యం కొనేది లేదని సీఎం చెప్తున్నారని పేర్కొన్నారు.రాష్ట్రంలో ధాన్యం కొనకపోతే తాము ఊరుకునేది లేదని బండి స్పష్టం చేశారు. యాసంగిలో కూడా పక్కా కొనాల్సిందేనని డిమండ్ చేశారు. లేదంటే ఎందుకు కొనరో సమాధానం చెప్పాలని సవాలు విసిరారు. ఇతర రాష్ట్రాల్లో లేని సమస్య తెలంగాణలో ఎందుకు వచ్చింది? అని ప్రశ్నించారు. మంచి విత్తనాలు రైతులకు అందిస్తే సమస్య ఉండదని అన్నారు. సీఎం కేసీఆర్కు పాకిస్తాన్ బంగ్లాదేశ్పై ప్రేమ పెరిగిపోయిందన్నారు. రైస్ బ్రాన్ ఆయిల్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని అంగీకరించి ఏర్పాటు చేశారా?. ధాన్యం సేకరణలో అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు.పాతబియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి ఎఫ్సీఐకి ఇస్తున్నట్లు తనిఖీల్లో తేలిందని బండి తెలిపారు. రైసు మిల్లర్ల మోసాలు బయటపడుతున్నందుకే ధర్నాలు చేస్తున్నారని రైతులకు అండగా ఉండాల్సిన సీఎం… రైసు మిల్లర్లకు అండగా ఉంటున్నారని విమర్శలు గుప్పించారు. “రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్ కారణం కాదా?. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం కేసీఆర్ కాదా?. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కేసీఆర్ కారణం కాదా?.“ అని బండి ప్రశ్నించారు. మొత్తంగా చూస్తే.. గతంలో చేసిన కామెంట్లకు.. తాజాగా కామెంట్లకు మధ్య చాలా వ్యత్యాసం ఉందనే చెప్పాలి అంటున్నారు పరిశీలకులు.

Previous articleమహిళా పోలీసు దారుణ హత్య
Next articleఇళ్ల పథకం విషయంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు రద్దు ఏపీ ప్రభుత్వానికి ఊరట … పేదల ఇళ్ల నిర్మాణానికి ఇక మార్గం సుగమం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here