హైదరాబాద్ నవంబర్ 5
ఈ నెల 9న రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు బీజేపీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలని కమలనాథులు డిమాండ్ చేస్తున్నారు. నవంబర్ 4 తర్వాత దళితబంధును ఎవరు ఆపలేరని టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ తన మాటను నిలబెట్టుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. త్వరలో తెలంగాణ ప్రభుత్వం దళితబంధును అమలు చేసే వరకు పోరాటం కమలనాథులు స్పష్టం చేశారు. 9న దళితబంధు ఆందోళనలు, 12న నిరుద్యోగ మిలియన్ మార్చ్‌తో ప్రజల్లోకి వెళ్ళాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది.