కామారెడ్డి అక్టోబర్ 19
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కేంద్రంలో ఈ రోజు మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైందని కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు,రెడ్ క్రాస్ కామారెడ్డి జిల్లా సెక్రటరీ రాజన్న లు పేర్కొన్నారు. ఎల్లారెడ్డి కేంద్రంలో ముస్లిం యువకులు మొట్టమొదటిసారిగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయటానికి సహకరించిన మాజీ జెడ్పిటిసి గయాజోద్ధిన్ మరియు సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని, అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా రక్తం అవసరం అయినట్లయితే 9492874006,7989440837 నంబర్ కి సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోశెట్టి, సంజీవరెడ్డి కార్యక్రమ నిర్వాహకులు సహావత్ అలీ, ముక్రమ్, ఇజాజ్,గపార్,
జలాలుద్దీన్ లు పాల్గొన్నారు.