జగిత్యాల నవంబర్ 01
:ఆన్ని దానాల కన్న రక్తదానం మహాగొప్పదని జిల్లా ఎస్పీ సీంధు శర్మ ఆన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవంను పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలో రక్తదానం శిబిరంను నిర్వహించారు. జిల్లా పోలీస్ శాఖ, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ సహకారంతో విరుపాక్షి గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఈ స్వచ్ఛంద రక్త దాన శిబిరాన్ని జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ ప్రారంభించి ,రక్తదానం చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ, ఆడ్మిన్ ఎస్పీ, డీఎస్పీ , వివిధ సర్కిళ్ల సిఐ లు ఎస్ఐ, పోలీస్ సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి యువతకు స్పూర్తి నింపారు.ఈ శిబిరం సందర్భంగా 59 మంది పోలీసులు, వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు రక్తదానం చేశారు.ఆనంతరం ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ,శస్త్రచికిత్సలు ,ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఏర్పడిన సందర్భంలో రక్తం దానం ఆవసరం ఏర్పడుతుందని ,వయస్సు తో ప్రమయం లేకుండా రక్తదానం చేసి ప్రాణాపాయస్థితిలో ఉన్నవారికి అపద్బందవులుగా నిలువాలన్నారు.రక్తదానం చేస్తే ఆనారోగ్యానికి గురవుతామనే అపోహాను విడనాడాలన్నారు.రక్తదాన శిబిరాల సందర్భంగా సేకరించిన రక్తాన్ని నిల్వ ఉంచి ప్రాణపాయ స్థితిలో ఉన్నవారికి అందజేయడం జరుగుతుందని తెలిపారు