తిరువనంతపురం సెప్టెంబర్ 29
కాషాయ పార్టీ నేతలు దేశాన్ని ఓ భౌగోళిక ప్రాంతంగా చెబితే తాము భారత్ అంటే ప్రజలు వారి మధ్య సంబంధాలని చెబుతామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధి స్పష్టం చేశారు. మలప్పురంలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో భిన్న విశ్వాసాలకు చెందిన ప్రజల మధ్య సత్సంబంధాలను విచ్ఛిన్నం సేందుకు ప్రయత్నిస్తున్నారని రాహుల్ ఆరోపించారు .ఈ దేశంలో హిందూ, ముస్లింల మధ్య, సిక్కుల మధ్య..తమిళ్, హిందీ, ఉర్దూ, బెంగాలీ వంటి వివిధ భాషల మధ్య సంబంధం చూడాలని అన్నారు.ఈ సంబంధాలను ప్రధాని మోదీ విచ్ఛిన్నం చేస్తున్నారనేదే తన ఆవేదనని ఆయన పేర్కొన్నారు. ప్రధాని ప్రజలు, ప్రాంతాలు, బాషల మధ్య సంబంధాలను తెగతెంపులు చేయడంలో బిజీగా ఉంటే తాను వీటిని బలోపేతం చేయడం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.భారతీయుల మధ్య బంధాలను తెంచడం ఆయన పనైతే దేశ ప్రజల మధ్య సంబంధాలను పటిష్టం చేయడం తన బాధ్యతని వ్యాఖ్యానించారు. విద్వేషాలతో ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు మోదీ ప్రయత్నించిన ప్రతిసారీ తాను ప్రేమతో వాటిని పునరుద్ధరించేలా చేస్తున్నానని చెప్పుకొచ్చారు.