నెల్లూరు
నెల్లూరు జిల్లా, బుచ్చి రెడ్డిపాలెం నగర పంచాయితీ ఎన్నికలలో వైకాపా బలపరిచిన ఛైర్ పర్సన్ అభ్యర్థి మోర్ల సుప్రజ ప్రసార కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ మీరు చలపతి పాల్గొన్నారు . ఈ సందర్భంగా చైర్ పర్సన్ అభ్యర్థిని మోర్ల సుప్రజాతో కలిసి స్థానిక 4వ వార్డులోని హరిజనవాడ,అరుంధతి వాడ మరియు శేషాద్రి నగర్ లలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్భంగా ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి సుప్రజని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గడపగడపకు తిరిగి, కరపత్రాలు పంపిణీ చేస్తూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో స్థానిక శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బలపరిచిన మోర్ల సుప్రజా విజయానికి అందరూ ఐక్యతగా సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి ఎ ఎ బి ఛైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి మరియు స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.