Home తెలంగాణ తిరుపతి లో సత్కారం బుగ్గారం కే గర్వకారణం

తిరుపతి లో సత్కారం బుగ్గారం కే గర్వకారణం

273
0

జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన చుక్క గంగారెడ్డి ఉత్తమ జర్నలిస్ట్ గా గుర్తింపుతో తిరుపతి లో అక్కడి ఎంపి డా.గురుమూర్తి చేతులమీదుగా సత్కారం పొందడం బుగ్గారం కే గర్వకారణం అని పలువురు ప్రముఖులు, బుగ్గారం వాసులు కొనియాడారు. బుగ్గారం లోని హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో శనివారం బుగ్గారం ప్రెస్ క్లబ్, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మండల, గ్రామ శాఖలు, గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చుక్క గంగారెడ్డి ని ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కారుదర్శులు మొగిలి సుధన్, మసర్ధి జీవన్, అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు నక్క చంద్రమౌళి, జర్నలిస్టులు ఏలేశ్వరం గౌరీ శంకర్, పల్లెర్ల సురేష్, కళ్లెం నగేష్, బిజేపి నాయకులు సాన తిరుపతి, కప్పల మల్లేశం, సుంకం ప్రశాంత్, కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షులు నగునూరి నర్సాగౌడ్, పొనగంటి కైలాసం, గ్లోబల్ స్కూల్ కరస్పాండెంట్ నక్కరాజు, జక్కుల లింగన్న, నక్క సాగర్, పెద్దవేని రాగన్న, మ్యానాల సురేష్, చిన్నపూర్ గడ్డం రమేష్, కేతి రాజమల్లు, డాక్టర్ అక్బర్, బోనగిరి తిరుపతి, మంగలి పోచమల్లు, గొడిశెల నారాయణ, మామిడి హన్మంత్, కమ్మరి రాములు, ఏలేశ్వరం సాయి, కంచర్ల నరేందర్ తదితరులు,  గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కారుదర్శులు మొగిలి సుధన్, మసర్ధి జీవన్, అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు నక్క చంద్రమౌళి,  ఏలేశ్వరం గౌరి శంకర్, పెద్దనవేని రాఘన్న, నక్క రాజు లతో పాటు పలువురు ప్రముఖులు మాట్లాడుతూ గంగారెడ్డి కి వచ్చిన గుర్తింపును వారు కొనియాడారు. ఇది మన బుగ్గారం మండలానికి గొప్ప గుర్తింపుగా వారు అభివర్ణించారు. జర్నలిస్ట్ గంగారెడ్డి ని ఆదర్శంగా తీసుకొని వివిధ రంగాలలో ఉన్న మన గ్రామస్తులు ఇలాంటి ఉత్తమ గుర్తింపు లను మరెందరో, మరెన్నో సాధించాలని వారు ఆకాక్షించారు. హనుమాన్ దేవాలయ అర్చకులు లవన్ కుమార్ ఆశీర్వచనంతో గ్రామస్తులతో కలిసి వారంతా చుక్క గంగారెడ్డి కి పూలమాలలు వేసి, శాలువాలతో ఘనంగా సన్మానించారు.

Previous articleఅంగన్వాడీ లో పిల్లలకు పౌష్టికాహారం అందించాలి వైస్ సర్పంచ్ పాంగి లావణ్యకుమారి
Next articleపెన్నా వంతెన బ్రిడ్జి సింహపురి ప్రజలకు అందుబాటులోకి వచ్చేనా జనసేన నాయకులు ఆందోళన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here