Home ఆంధ్రప్రదేశ్ బూతు కొట్టు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి..! నందికొట్కూరు ఎమ్మెల్యే...

బూతు కొట్టు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి..! నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ తొగురు

90
0

నందికొట్కూరు

పట్టాభి  బూతు వ్యాఖ్యలకు నిరసనగా గురువారం నాడు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ తొగురు  ఆధ్వర్యంలో  జనాగ్రహ దీక్ష చేపట్టారు.స్థానిక నాయకులు ప్రజా ప్రతినిధులతో మహనేత స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం దీక్ష ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆర్థర్  మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పిలుపు ఇచ్చిన రాష్ట్ర బంద్ విఫలం కావడంతో చంద్రబాబు నాయిడు 36 గంటల దీక్ష పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ,చంద్రబాబు దీక్ష అప్రజాస్వామికమన్నారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై చంద్రబాబు డైరెక్షన్ లో పట్టాభి చేసిన వ్యాఖ్యలపై ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పట్టాభి ని తరిమికోడతారని అన్నారు.
ఇదే పద్దతి కొనసాగితే  తెలుగుదేశం పార్టీకి, వాళ్ల దగ్గర ఉన్న పెయిడ్ బ్యాచ్ కి,  చంద్రబాబుకు ప్రజలంతా తగిన బుద్ధి చెపేందుకు  సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు.
చంద్రబాబు నాయుడు సిగ్గులేకుండా దీక్ష చేయడం చాలా దారుణం, పట్టాభి వాఖ్యలపై చంద్రబాబు కనీస స్పందించకుండా  దీక్ష కు పిలుపు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని అన్నారు.
టిడిపి నాయకులు మా సహనాన్ని బలహీనతగా తీసుకోవద్దు మేము ప్రజాస్వామ్యం లో ఉన్నాము కావున మా నాయకుడు విలువలు పాటించే నాయకుడు కావున టిడిపి నాయకుల ఆటలు కొనసాగుతున్నాయి.
ఒక్కసారి మా నాయకుడు సైగ చేస్తే చంద్రబాబు నాయుడు తిరగలేరు అని ఆర్థర్ గారు అన్నారు.
పట్టాభి వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారు.. చంద్రబాబు నాయుడు జగన్ మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు చూసి నేను ఎప్పటికీ సీఎం కాలేను అని భయపడి ఈ విధంగా విమర్శలు చేపిస్తున్నారు..
ప్రజల అభిమానం ఉన్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు అటువంటి నాయకుడిని కించపరిచే విధంగా మాట్లాడితే ప్రజలు సహించరు  తిరగబడతారు..
టిడిపి నాయకులు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి లేకపోతే టిడిపి నాయకులు తిరగ లేరు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన స్థానిక నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Previous articleగోస్పాడు మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన నంద్యాల సబ్ కలెక్టర్
Next articleవ్యవసాయం పై మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here