హైదరాబాద్, సెప్టెంబర్ 23
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా జిహెచ్ఎంసిలో విలీనం చేస్తేనే ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుందని రాష్ట్ర పశుసంవర్దక, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని రసూల్ పుర కృష్ణకాలనీలో కట్ట మైసమ్మ సిల్వర్ కాంపౌండ్ రూ. 17.36 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన జి+3 అంతస్తుల గల 8 బ్లాక్ లలో నిర్మించిన 168 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను హోం మంత్రి మహమూద్ అలి, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సిహెచ్ మల్లా రెడ్డి, శాసన సభ్యులు సాయన్న లతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ….ఈ ప్రాంతం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న నేపథ్యంలో అభివృద్ధికి దూరంగా ఉందని ఇక్కడ పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ అధికారులు ఏమాత్రం నిధులు తెచ్చే అవకాశం లేదన్నారు. కంటోన్మెంట్ ఏరియా చుట్టు ప్రక్కల ప్రాంతం ఎంతో అద్భివృద్ది చెందినట్లు జిహెచ్ఎంసిలో విలీనమైతే సంక్షేమ అధివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయన్నారు. కంటోన్మెంట్ ఏరియా పది వేల ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందని జిహెచ్ఎంసిలో విలీనం అయితే పేదలకు మరిన్ని గృహాలు నిర్మించి ఇవ్వవచ్చాన్నారు. తద్వారా పేదలు గొప్పగా బ్రతికే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.