హైదరాబాద్ నవంబర్ 30
సికింద్రాబాద్ వైఎంసీఏ ఫ్లై ఓవర్‌పై మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న కారు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారు డ్రైవర్ తక్షణమే వాహనాన్ని ఆపాడు. ఆ వెంటనే కారులో నుంచి డ్రైవర్ దిగిపోయాడు. కారులో మంటలు చెలరేగడంతో అన్ని వాహనాలు ఆగిపోయాయి. దీంతో ఆ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటానస్థలికి సకాలంలో చేరుకోలేకపోయింది. ఈ అగ్నిప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది.