నందికొట్కూరు. నవంబర్ 03
ప్రమాదవశాత్తు కారు బోల్తా పడి ఆత్మకూరు మున్సిపల్ డీఈ నరేష్ కు గాయాలయ్యాయి. ప్రమాద సంఘటన తెలుసుకున్న నందికొట్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ రబ్బాని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు.పట్టణ ఎస్ఐ ఎన్ వి రమణ తన సిబ్బంది తో కలిసి ప్రమాద స్థలానికి చేరుకున్నారు.బాధితులను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ వైద్య శాలకు తరలించారు. నందికొట్కూరు పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలు స్థానికులు పోలీసుల కథనం మేరకు ఆత్మకూరు మున్సిపాలిటీలో డీఈ గా విధులు నిర్వహిస్తున్న నరేష్ పనులు పూర్తి చేసుకుని మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఇటికా కారులో ఆత్మకూరు నుంచి కర్నూలు కు బయలుదేరారు.నందికొట్కూరు కోర్టు సమీపంలో కారు అదుపుతప్పి బోల్తాపడింది. డివైడర్ను బలంగా ఢీకొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది.డీఈ కి గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న మున్సిపల్ వైస్ చైర్మన్ రబ్బాని, పట్టణ ఎస్ఐ రమణ సకాలంలో స్పందించారు. క్షత్రగాత్రులను కారులో నుంచి బయటకు తీసి 108 కి సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతున్న డీఈ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సకాలంలో స్పందించిన వైస్ చైర్మన్, పట్టణ ఎస్ఐ లకు స్థానికులు అభినందించారు.