బెల్లంపల్లి నవంబర్ 15
బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ప్రమాదవశాత్తు కారు బోల్తా మంచిర్యాల జిల్లా ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ సంజయ్ నాగపూర్ నుండి మంచిర్యాల వైపు వెళ్లే క్రమంలో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర నేషనల్ హైవే రోడ్డు పనులు జరుగుతున్న స్థలంలో బండరాళ్లు రోడ్డుపై పడేసి ఉండడంతోఅటుగా వెళ్తున్న టీఎస్19ఈ 7303 అనే కారు చక్రంలో బండరాయి దూరడంతో కారు ఒక్కసారిగా ఆగిపోయి బోల్తా కొట్టిందని అదృష్టవశాత్తు కారు ప్రమాదంలో గాయాలతో ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ సంజయ్ ప్రాణాలతో బయటపడ్డారు అని, కారు ప్రమాదం జరగడానికి నేషనల్ హైవే రోడ్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, కనీస నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టా రీతిగా పనులు నిర్వహిస్తున్నారని,దీనిపై అధికారులు స్పందించి కాంట్రాక్టు నిర్లక్ష్యం కు చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు…