101 కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి మొక్కులు తీర్చుకున్న వైస్సార్సీపీ నాయకులు
శ్రీశైలం
శ్రీశైలనియోజకవర్గంలోని 48 ఎంపీటీసీ స్థానాలకుగాను నలభై ఎనిమిది ఎంపీటీసీ స్థానాలను, నాలుగు జడ్పిటిసి స్థానాలకు నాలుగు జడ్పిటిసి లను వైఎస్ఆర్సిపి పార్టీ కైవసం చేసుకొని విజయ భేరి మోగించింది.
ఈ సందర్భంగా సోమవారము నాడు శ్రీశైలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టి కైవసం చేసుకున్న సందర్భంగా శ్రీశైలం దేవస్థానం పరిదిలో ఆలయం ముందు బాగాన 101 కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి మొక్కలు తీర్చుకున్నారు. నియోజకవర్గంలో విజయవంతంగా ఘనవిజయం సాధించిన సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలోని మండల కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు ఎం.ఏ రజాక్,అనిల్ కుమార్ రెడ్డి, రామ్ మోహన్, సత్యనారాయణ, రాజారెడ్డి,ప్రభావతి,కోటమ్మ మొదలగు కార్యకర్తలు పాల్గొన్నారు