Home తెలంగాణ హుజురాబాద్‌ ఉప ఎన్నికలకు 20 కంపెనీల కేంద్ర బలగాలు

హుజురాబాద్‌ ఉప ఎన్నికలకు 20 కంపెనీల కేంద్ర బలగాలు

112
0

హైదరాబాద్‌ అక్టోబర్ 22
హుజురాబాద్‌ ఉప ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈసీ తగు జాగ్రత్తలను తీసుకుంటున్నది. అందులో భాగంగా ఉప ఎన్నిక కోసం 20 కంపెనీల కేంద్ర బలగాలు ఒకటి, రెండు రోజుల్లో రానున్నాయి. ఇప్పటికే హుజూరాబాద్‌కు 3 కంపెనీల బలగాలు చేరుకున్నాయి.హుజూరాబాద్‌లో ఇప్పటివరకు రూ.1.80 కోట్ల నగదు, రూ.6.11 లక్షల విలువైన మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఉప ఎన్నిక నిర్వహణ కోసం మరో వ్యయ పరిశీలకుడిని ఈసీ నియమించింది.కాగా, ఇప్పటివరకు మొదటి డోస్ కరోనా వ్యాక్సినేషన్ తీసుకున్న ఓటర్లు 97.6 శాతం కాగా, 2వ డోస్ వ్యాక్సినేషన్ తీసుకున్న ఓటర్లు 59.9 శాతంగా నమోదైంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి దాదాపు వంద శాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తయి అయినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

Previous articleచైనాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఇండియా బహుపరాక్
Next articleజోరందుకున్న జాబ్ మార్కెట్‌..మ‌ళ్లీ కొలువుల క‌ళ‌!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here