Home నగరం యాదాద్రిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

యాదాద్రిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

120
0

జన ఆశీర్వాద పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి బిజెపి నేత కిషన్ రెడ్డి యాదాద్రి జిల్లాలో పర్యటించారు. శనివారం  ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కిషన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు… ఇందులో భాగంగా కిషన్ రెడ్డికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. కేంద్ర మంత్రికి ప్రత్యేక పూజల అనంతరం వేదపండితులు ఆశీర్వచనం అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి దర్శనం అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను ఆలయ అధికారులు, యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అధికారులతో తో కలసి పరిశీలించారు.

 

Next articleషూటింగ్ విరామంలో ‘భీమ్లా నాయక్’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here