జగిత్యాల నవంబర్ 15
హైదరాబాద్ లోని గంప నాగేశ్వరరావు ఇంపాక్ట్ ఫౌండేషన్ చే నిర్వహించిన శిక్షణ శిబిరంకు జగిత్యాల పట్టణంకు చెందిన వావిలాల పవన్ కుమార్ హాజరు కాగా ట్రెయిన్ ద ట్రైనర్ గా పవన్ కుమార్ ప్రశంస పత్రం అందుకున్నారు. రెండు రోజుల పాటు హైదరాబాద్ లో జరిగిన ఈ వర్క్ షాపులో మొటివేషన్ ట్రైన్డ్ స్పీకర్ గా సర్టిఫికేట్ తీసుకున్నారు. వర్క్ షాపు చివర రోజు నిర్వహించిన ఈ కార్యక్రమంలో గంప నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చొక్కాపు వెంకటరమణ రావు చేతుల మీదుగా పవన్ కుమార్ ఈ ప్రశంస పత్రం అందుకున్నారు. వ్యక్తిత్వ వికాస నిపుణులుగా ప్రశంస పత్రం అందుకున్న సందర్భంగా పవన్ ను పలువురు అతని మిత్రులు అభినందించి శుభకాంక్షలు తెలిపారు. అలాగే ఇంటెలిజెన్స్ లో పని చేస్తున్న వావిలాల గంగాధర్ కుమారుడికి ప్రశంస పత్రం దక్కిన సందర్భంగా అతని డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న తోటి ఉద్యోగులు, పలువురు సన్నిహితులు వావిలాల గంగాధర్ కు శుభాకాంక్షలు తెలిపారు.