Home ఆంధ్రప్రదేశ్ నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన రెడ్ క్రాస్ చైర్మన్

నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన రెడ్ క్రాస్ చైర్మన్

119
0

నెల్లూరు
నెల్లూరు రెడ్ క్రాస్ నందు చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా పేదలకు ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్  పి. చంద్ర శేఖర్ రెడ్డి , చెప్పులు కుట్టు వారు, చిత్తు కాగితాలు ఏరుకునే వారి కుటుంబాలను గుర్తించి, వారికి ఉచితంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ పి. చంద్ర శేఖర్ రెడ్డి  మాట్లాడుతూ కోవిడ్ సమయంలో చెప్పులు కుట్టు వారు మరియు చిత్తు కాగితములు ఏరుకునే వారు ,ఆర్ధికంగా ఇబ్బందులకు గురై వారి కుటుంబాలను నడుపుకొనుటకు ఇబ్బందులకు గురైనట్లు తెలుస్తుందన్నారు.  అటువంటి  కష్ట కాల సమయంలో జాన్ హోప్కిన్స యునివర్సిటి వారి సౌజన్యంతో చెప్పులు కుట్టు వారు , చిత్తు కాగితాలు కాగితములు ఏరుకునే వారికి ఉచితంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నన్నారు.
ఇదే విధంగా గతంలో కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ కు నిత్యవసర సరుకులను పంపిణీ చేయడం జరిగినది అని తెలియచేశారు.
లాక్ డౌన్ సమయంలో ఉచితంగా నాణ్యమైన 55,000 భోజనాలు, బట్టలు, దుప్పట్లు, సబ్బులు, బ్రష్ లు, టూత్ పేస్ట్ లు, షాంపూలు 73 రోజుల పాటు 4 వివిధ పునరావాస కేంద్రాలలో పంపిణీ చేయటం జరిగిందని తెలియచేసారు.
ఇదే కాకుండా జిల్లా రెడ్ క్రాస్ నూతన కమిటీ వచ్చినప్పటి నుండి వివిద సేవ కార్యక్రమములు చేయటం జరుగుతోందని తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా శాఖ మేనజింగ్ కమిటీ సభ్యులు గునపాటి ప్రసాద్ రెడ్డి,  యడవలి సురేష్,   దాసరి రాజేంద్ర ప్రసాద్, నెల్లూరు జిల్లా శాఖ కింద వున్న ప్రాజెక్టు కన్వీనరు  బి.వెంకు రెడ్డి,  రెడ్ క్రాస్ జీవిత కాల సభ్యులు మరియు రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Previous articleమృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ నేతలు
Next articleబెల్టు షాపులపై ముమ్మరంగా దాడులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here