కడప నవంబర్ 16
కడప లో మంగళవారం ఎయిడెడ్ విద్యాసంస్థలను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ తెలుగు నాడు విద్యార్ధి ఫెడరేషన్ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్ ,మాసాపేట శివ, రాష్ట్ర అధికార ప్రతినిధి నవీన్ లు మాట్లాడుతూ, ఎయిడెడ్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసేందుకు జారీ చేసిన జీవో నెం. 42, 50, 52,లను తక్షణం రద్దు చేశారు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థ రద్దుతో అందులో చదువుకునే రెండున్నర లక్షల మంది పేద విద్యార్దులతో జగన్ ప్రభుత్వం చెలగాటాలాడుతుంది. ఎయిడెడ్ విద్యా సంస్థల ఆస్తులు, భూములను దోచుకునేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులను రోడ్డుకీడుస్తున్నారు అన్నారు. ప్రశ్నించిన విద్యార్ధులపై పోలీసులతో లాఠీ చార్జ్ చేయించడం దుర్మార్గమన్నారు, పోలీసులతో విద్యార్ధులను అణచివేయాలని ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తోంది. విద్యార్ధులు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయని చరిత్ర చెబుతోందన్నారు విద్యార్ధుల జీవితాలతో ఆటలాడుతున్న జగన్ ప్రభుత్వాన్ని విద్యార్ధి లోకం క్షమించదు అన్నారు.
గడిచిన రెండున్నరేళ్లుగా ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది పేర్కొన్నారు నాడు నేడు పేరుతో రూ.16వేల కోట్లు దోపిడీకి పాల్పడ్డారు. అమ్మ ఒడిని అందరికి ఇస్తామని సగం మంది విద్యార్ధులకు ఇచ్చి అందులోను రూ.15వేలను కాస్త రూ.14వేలకు తగ్గించారు. ఈ ఏడాది అది కూడా అమలు చేయలేదని ఎద్దేవా చేశారు వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు చదువు దూరం చేసే జీవో నెంబర్ 40 ,50,52 జీవోను వెంటనే రద్దు చేయాలని చేయకపోతే ఈ నెల 18 వ తారీకు నాడు అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో
టి.ఎన్.ఎస్.ఎఫ్.
కడప నగర అధ్యక్షుడు
చిట్వేలి అనిల్ బాబు,
టి.ఎన్.ఎస్.ఎఫ్.కడప పార్లమెంట్ ఉపాధ్యక్షులు పల్లె గంగాధర్, చంద్రశేఖర్
టి. ఎన్.ఎస్.ఎఫ్.
కడప పార్లమెంట్ కార్యదర్శి చవలముడి వినయ్, టి.ఎన్.ఎస్.ఎఫ్.కడప పార్లమెంట్ నాయకులు విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు..