Home ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష ప్రారంభం

చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష ప్రారంభం

101
0

అమరావతి
తెదేపా అధినేత చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష ప్రారంభమైంది. తెదేపా కేంద్ర కార్యాలయంపై దుండగుల దాడి, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాలపై వైకాపా నేతలు, కార్యకర్తల దాడి యత్నాలకు నిరసనగా ఆయన దీక్ష చేపట్టారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో పగిలిన అద్దాలు, ధ్వంసమైన సామగ్రి మధ్యలోనే చంద్రబాబు దీక్షకు కూర్చొన్నారు. ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన దీక్ష రేపు రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది.చంద్రబాబు దీక్ష నేపథ్యలో పార్టీ కేంద్ర కార్యాలయానికి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా వివిధ జిల్లాల నుంచి ముఖ్యనేతలంతా అక్కడికి చేరుకున్నారు.

Previous articleపోలీసు అమరవీరుల స్మారక దినోత్సవం
Next articleక‌రోనాపై పోరాటంలో అసాధార‌ణ మైలురాయిని అందుకున్న‌ఇండియా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here