అమరవాతి నవంబర్ 17
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాల్టీలో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. ఈ మున్సిపాల్టీలో మొత్తం 25 వార్డులు ఉండగా వైఎస్సార్‌సీపీ 18, టీడీపీ 6 వార్డుల్లో విజయం సాధించాయి. గతంలోనే ఒక వార్డు వైఎస్సార్‌సీపీ గెలుపొందింది. ప్రసుత్తం ఆ పార్టీకి 19 మంది గెలుపొంది తొలిసారి కుప్పం మున్సిపాల్టీపై వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయనున్నారు.కొన్ని దశాబ్దాలుగా తెలుగుదేశంపార్టీకి, టీడీపీ అధినేత చంద్రబాబుకు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ని మున్సిపాల్టీ చేజారడం పట్ల చంద్రబాబుతో సహ ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో ఉన్నారు