Home ఆంధ్రప్రదేశ్ జగన్ మోహన్ రెడ్డి కి చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలి నంద్యాల ఎమ్మెల్యే...

జగన్ మోహన్ రెడ్డి కి చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలి నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి

122
0

నంద్యాల
సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ని పట్టుకుని బూతులు తిట్టిన టిడిపి శ్రేణుల పక్షాన నిలిచిన నారా చంద్రబాబు నాయుడు సీయం జగన్ మోహన్ రెడ్డి కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ గురువారం నంద్యాల గాంధీ విగ్రహం వద్ద రెండు రోజుల నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు నంద్యాల యమ్ యల్ ఏ శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు అభిమానులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. యమ్ యల్ ఏ శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ సీయం జగన్ మోహన్ రెడ్డి ని ప్రతి పక్ష పార్టీ నేతలు బూతులతో తిట్టడం సరికాదన్నారు. సామాన్యులు కూడా సీఎం ను దూషించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి తన బుద్ది మాలిన పనులకు స్వస్తి చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టిడిపి శ్రేణులు వారి భాషను మార్చుకోక పోతే ప్రజలే వారిని తరిమి తరిమి కొడతారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు..

Previous articleవివిధ శాఖల సమన్వయంతో కోవిడ్ వ్యాక్సినేషన్ లక్ష్యం సకాలంలో పూర్తిచేయాలి * జిల్లా కలెక్టర్ జి. రవి
Next articleగోస్పాడు మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన నంద్యాల సబ్ కలెక్టర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here