Home ఆంధ్రప్రదేశ్ సరికొత్త టెక్నాలజీతో చరిత్రలో తొలిసారిగా చౌకగా మంచి నీటి సరఫరా మరో వినూత్న...

సరికొత్త టెక్నాలజీతో చరిత్రలో తొలిసారిగా చౌకగా మంచి నీటి సరఫరా మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ ఇలాకాలో ప్రతి ఇంటికి నేరుగా రక్షిత మంచినీరు పెన్నా నది నుంచి ప్రత్యేక పైప్ లైన్ ద్వారా శుద్ధి చేసిన నీరందించేలా ఏర్పాట్లు అభివృద్ధికి చిరునామాగా మారుతోన్న ఆత్మకూరు అదానీ ఫౌండేషన్ సహకారంతో అమలు చేసే ఆర్వో వాటర్ ప్లాంట్ అక్టోబర్ 30న లాంచ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

193
0

అమరావతి, అక్టోబర్, 28: సరికొత్త టెక్నాలజీతో మెట్టప్రాంతమైన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు సురక్షిత మంచినీటిని చౌకగా సరఫరా చేసే దిశగా మంత్రి మేకపాటి అడుగులు వేస్తున్నారు. అదానీ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఆర్వో ప్లాంట్ ను అక్టోబర్ 30న ఆత్మకూరులో ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకూ ఎక్కడా లేని విధంగా తొలిసారిగా మంత్రి మేకపాటి సొంత నియోజకవర్గంలోని ఆత్మకూరులో శుద్ధి చేసిన నీటిని కోరుకున్నవారి ఇంటికే నేరుగా సరఫరా చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. అదానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమలు కానున్న ఆర్వో వాటర్ డైరెక్ట్ టు హోమ్ కార్యక్రమం  ఆత్మకూరులో ప్రారంభించిన అనంతరం నియోజకవర్గం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టనున్నట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు.  పెన్నా నది నుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పైప్ లైన్ ద్వారా నీటిని ఆర్వో ప్లాంట్ వద్దకు తీసుకువచ్చి అక్కడ ప్యూరిఫై చేసి.. పట్టణ ప్రజలు కోరుకున్న ఇంటికి ఈ పైపులు అమరుస్తారు. ముందుగానే డబ్బు చెల్లించి నీటిని పొందే ఈ ప్రాజెక్టులో 20 లీటర్ల నీటిని కేవలం రూ.5 అందించనున్నట్లు మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. సెల్ ఫోన్ రీఛార్జ్ తరహాలో ముందుగా డబ్బు చెల్లించడం (ప్రీ పెయిడ్ కార్డు) నీటిని పొందవలసి ఉంటుందని పేర్కొన్నారు.

అత్యాధునిక హంగులతో ఆత్మకూరు బస్ స్టాండ్ : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి

పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కషితో ఆత్మకూరు బస్టాండ్ రూపురేఖలు మారనున్నాయి. ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ పరిశ్రమ అందించే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సామాజిక బాధ్యత) నిధుల ద్వారా బస్ స్టాండ్ ని అభివద్ధి చేయనున్నట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు. రూ.1.5 కోట్ల సీఎస్ఆర్ నిధులతో బస్ స్టాండ్ సహా చుట్టు పక్కల చిరు వ్యాపారులకు దుకాణాలు కూడా నిర్మించనున్నారు. ఇప్పటికే పనులు మొదలైన బస్ స్టాండ్ ను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దాలని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబుకు మంత్రి మేకపాటి ఆదేశించారు. వేగవంతంగా నిర్మాణ పనులు పూర్తి చేసి నియోజకవర్గ  ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని మంత్రి స్పష్టం చేశారు.

Previous articleరైలు కిందపడి మహిళ ఆత్మహత్య
Next articleపదిహేను నెలల తరువాత భక్తుల కు పాతాళ గణపతి దర్శనం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here