పత్తికొండ
పత్తికొండ మండల పరిధిలోని పలు గ్రామాల ఆర్బికే సెంటర్ లను వ్యవసాయ అధికారిని సరిత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చిన్నహుల్తి, దేవనబండ, నలకదొడ్డి రైతు భరోసా కేంద్రాలలో నమోదు చేసుకున్న రైతుల ఈ-పంట జాబితాను పరిశీలించారు. దీనిని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ పత్తికొండ మండలానికి సంబంధించిన అన్ని రైతు భరోసా కేంద్రాలలో 2021 ఖరీఫ్ పంట నమోదు చేసుకున్న రైతుల జాబితాను ఉంచడం జరిగింది. ఈ క్రాఫ్ట్ పంట నమోదు చేసుకున్న రైతులు తప్పకుండా ఈకేవైసీ చేయించుకుంటే ప్రభుత్వం అందించే రైతు భరోసా, పంట నష్టం, పంట రుణాలు వంటివి వర్తిస్తాయని తెలియజేశారు. తప్పకుండా ప్రతి ఒక్క రైతు గ్రహించి ఆర్బికే సెంటర్ కు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలని తెలిపారు. త్వరలో పంట ఉత్పత్తుల కొనుగోలు చేపడతామని తెలియజేశారు. కావున ఈకేవైసీ చేసుకోని వారికి ప్రభుత్వం నుంచి లభించే పథకాలు ఏవైతే ఉన్నాయో అవి లబ్ది పొందలేరని తెలిపారు.