కామారెడ్డి నవంబర్ 16
కామారెడ్డి జిల్లా బాన్సువాడ లోని ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఉర్దూ మీడియం పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం భోజనం ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కూర్చుని భోజనం చేశారు.
మధ్యాహ్న భోజనం బాగుందని సంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థులను వివిధ రకాల ప్రశ్నలడిగి సమాధానాలు రాబట్టారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. మరుగుదొడ్లను, వంటశాల ను
పరిశీలించారు. పాఠశాలలో తాగునీటి సమస్య ఉందని ఉపాధ్యాయులు, విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. నీటి ప్లాంట్ ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజాగౌడ్, ఉపాధ్యాయులు
పాల్గొన్నారు.