నర్సిపట్నం
నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పెద్ద బొడ్డేపల్లి నుండి చోడవరం రోడ్డు మార్గంలో చెట్టుపల్లి ఊరికి దగ్గరలో రోడ్డు గుంతలు పడి ఇప్పటికే ప్రమా దాలు జరిగితే కొంతమందికి దెబ్బలు తగలడం జరిగింది. ఈ పరిస్థితిని
చూసి చెట్టుపల్లి జనసేన పార్టీ కార్యకర్తలు రోడ్డు రిపేరు చేసారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు ఇదివరలో రాష్ట్ర ప్రభుత్వానికి మీరు రోడ్లు బాగు చెయ్యకపోతే మేమే చేస్తాం అన్న మాట ప్రకారం ఈరోజు మా గ్రామంలో మా
అధినేత అక్టోబర్ రెండవ తారీకున చేయనప్పటికీ ముందుగానే చేయటం సహాయం చేయడంలో ముందుంటుంది పార్టీ అని వారు అన్నారు