Home తెలంగాణ నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్ యువజన కాంగ్రెస్...

నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎలేటి మహిపాల్ రెడ్డి

123
0

కోరుట్ల నవంబర్ 09
తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి పిలుపు మేరకు, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు,సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణరావుల ఆదేశాల మేరకు కోరుట్ల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎలేటి మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిరుద్యోగ చైతన్య దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా
యూత్ అధ్యక్షులు ఎలేటి మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్రంలో కొత్తగా మద్యం దుకాణాలను పెంచడం జరిగింది కానీ 2018 నుండి ఇప్పటివరకు కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్స్ మాత్రం ఇవ్వలేదని , నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్ కనీసం మ్యానిఫెస్టో లో చెప్పిన విధంగా నిరుద్యోగ భృతి అయినా ఇవ్వకపోవడం దురదృష్టకరం ఆన్నారు.
నోటిఫికేషన్స్ విడుదల చేయని పక్షణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో  పెద్దఎత్తున ఉద్యమం చేపాడుతమని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు ఎలేటి శశింధర్ రెడ్డి,కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి శంకర్ గౌడ్, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి మ్యాకల నర్సయ్య,జాయింట్ సెక్రెటరీ సత్యనారాయణ,యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ కో ఆర్డినేటర్ గోరుమంతుల ప్రవీణ్ కుమార్ ,పట్టణ మాజీ అధ్యక్షులు ఏ ఆర్ అక్బర్,వెంకటేష్ గౌడ్,రహీం యువజన కాంగ్రెస్ నాయకులు పన్నాల అంజిరెడ్డి, అన్వర్,హైమద్, అజయ్,రఘు,శేఖర్,సాయిమధు,ప్రణయ్,సుమన్,జమిల్,అర్ఫత్ అయ్యుబ్, తదితరులు పాల్గొన్నారు.

Previous articleఏపీ పీజీసెట్‌ ఫలితాలు విడుదల
Next articleమావోయిస్టుల బూబీట్రాప్ నిర్వీర్యం చేసిన చింతూరు పోలీసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here