కామారెడ్డి నవంబర్ 30
:గత రాత్రి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పై సీఎం కెసిఆర్ మీడియా సమక్షంలో అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో నిజాం సాగర్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ దహనం చేసారు. ఈసందర్బంగా జిల్లా అధ్యక్షులు బంగ్లా చైతన్య గౌడ్ మాట్లాడుతూ
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా మరిచి ఒక కేంద్రమంత్రినీ ఇష్టాను సారంగా దూషించి ముఖ్యమంత్రి పదవీకే ఆపాకీర్తి తెచ్చారాని, ఎక్కడ ఎన్నికలలోచ్చిన తుమ్మెదల్ల వాలిపోయే తెరాస నాయకులు ఎన్నికల అనంతరం పట్టలేకుండా పోతారని, దళిత బంధు, దళితులకి మూడేకరాల భూమి, దళిత ముఖ్యమంత్రి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వంటి చెల్లని హామీలిచ్చి కెసిఆర్ పబ్బం గడుపుతున్నరనీ,తెరాస ప్రభుత్వ పతనం ఆసన్నమైందని, అధికార మదంతో వీర్రావిగుతున్న కెసిఆర్ నియాంతుత్వ పాలనను తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే రోజులు ముందున్నాయని, కెసిఆర్ వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.