Home నగరం జ‌ల‌శక్తి శాఖ మంత్రి షెకావ‌త్‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ భేటి

జ‌ల‌శక్తి శాఖ మంత్రి షెకావ‌త్‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ భేటి

95
0

న్యూఢిల్లీ సెప్టెంబర్ 25
ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ శ‌నివారం మ‌ధ్యాహ్నం కేంద్ర జ‌ల‌శక్తి శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా సాగునీటి ప్రాజెక్టులు, జ‌లాల పంపిణీపై 40 నిమిషాల పాటు చ‌ర్చించారు. నిన్న మ‌ధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన విష‌యం విదిత‌మే.26న (ఆదివారం) ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిర్వహించే నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సమావేశంలో కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం ధా న్యం కొనుగోలు అంశంపై కేంద్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో సమావేశం అవుతారు. అదేరోజు సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగివస్తారు. సీఎం వెంట ఢిల్లీకి వెళ్లిన అధికారుల్లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Previous articleఐక్య‌రాజ్య‌స‌మితి లోఇమ్రాన్ ఖాన్ కు భార‌త ప్ర‌తినిధి స్నేహ దూబే కౌంట‌ర్
Next articleఅన్నమయ్య కీర్తనలు అందరికీ చేరువకావాలి – అదివో అల్ల‌దివో …. అన్న‌మ‌య్య పాట‌ల పోటీలకు ఎంపిక ప్రారంభం – ఎస్వీబిసి ఛైర్మ‌న్ డా. సాయి కృష్ణ యాచేంద్ర‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here