హైదరాబాద్:
భారత జాతిపిత మహాత్మా గాంధీ 152 వ జయంతిని పురస్కరించుకొని అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి శనివారం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడు దేశం కోసం చేసిన సేవలు స్మరించుకోవాల్సిన అవసరముందన్నారు.దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో ప్రధాన భూమిక బాపు గాంధీ పోషించారన్నారు.స్వాతంత్ర్య భారతావనిలో 135 కోట్ల భారత ప్రజానీకం ఇవాళ స్వేచ్ఛ వాయువులు పీల్చుతున్నారంటే మహాత్మా గాంధీ చొరవే అన్నారు.గాంధీ చూపిన బాటలోనే అహింస మార్గంలొ ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాదించుకున్నామని తెలిపారు.మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని,పల్లెలు దేశానికి పట్టు కొమ్మలు అన్న గాంధీ మాటలను నిజం చేస్తూ గ్రామాలను అన్ని విధాలా ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు.
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సాకారమవుతుందని అన్నారు.జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందరు సహకారాన్ని అందించాలని మంత్రి వేముల అన్నారు. అసెంబ్లీ ఆవరణలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి,మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ,రాజ్యసభ సభ్యులు సంతోష్,ఎమ్మెల్సీ లు కవిత,వి.జి.గౌడ్,నవీన్ కుమార్ తెరా చిన్నప్ప రెడ్డి లతో కలిసి జమ్మి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు,అసెంబ్లీ సెక్రటరీ నరసింహ చార్యుల టిఆర్ఎస్ఎల్పీ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Home తెలంగాణ మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన గాంధీ చూపిన అహింస మార్గంలొనే తెలంగాణ...