రుపతి
ఈ నెల 2,3 తేదీలలో రాష్ట్ర ముఖ్య మంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో పాడిపేట, వేదల్ల చెరువు యస్.టి కాలనీ, తిరుచానూరు వద్ద గల దెబ్బ తిన్న బ్రిడ్జి లను మరియు కాలనీలను, ఆటోనగర్, ఎం.ఆర్.పల్లి కృష్ణానగర్ ను పర్యటించనున్న నేపథ్యంలో ముందస్తు భద్రత ఏర్పాటు నిమిత్తం డిప్యూటీ సి.యం నారాయణ స్వామీ, జిల్లా యస్.పి వెంకట అప్పల నాయుడు, జిల్లా కలెక్టర్ హరి నారాయణన్, కలసి ముంపు ప్రాంతాలను పరిశీలించారు.
అనంతరం తిరుపతి ఆర్.డి.ఓ కార్యాలయం నందు జిల్లా యస్.పి గారు, జిల్లా కలెక్టర్ గారు ఇతర శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి గౌ” రాష్ట్ర ముఖ్య మంత్రి పర్యటన నేపథ్యం లో భద్రతా ఏర్పాట్లు, పటిష్ఠ బందోబస్తు వ్యవస్థ తదితర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా యస్.పి మాట్లాడుతూ ముఖ్యమంత్రి 2,3వ తేది రానున్న నేపధ్యంలో ఈ రోజు తిరుపతి రేణిగుంట విమానాశ్రయం నుండి అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్ ను సి.యం పర్యటించు ప్రాంతాలలో నిర్వహించడం జరిగిందని తెలిపారు.
చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరం జరగకుండా స్పెషల్ పార్టీ పోలీసులచే ఆర్.ఓ.పి, బి.డి టీం, డాగ్ స్క్వాడ్ లచే తనికీ చేపట్టాలని అలాగే కార్యక్రమ ప్రాంతాన్ని కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసే విధంగా ప్రణాళిక సిద్దం చేసుకోవాలని అధికారులకు సూచించారు.