Home ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష

విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష

341
0

అమరావతి.
క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖపై సీఎం  వైయస్.జగన్  మోహన్ రనెడ్డి సమీక్ష నిర్వహించారు. స్కూళ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరు, అమ్మ ఒడి, విద్యాకానుకపై అధికారులతో సీఎం విస్త్రృత చర్చ జరిపారు. కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులపై సీఎం ఆరా తీసారు.  పాఠశాలల్లో కరోనా నివారణ చర్యలను అడిగి తెలుసుకున్నారు.  ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కారణంగా పాఠశాలలపై కరోనా ప్రభావం పెద్దగా లేదు.  టీచర్లందరికీ వ్యాక్సినేషన్ పూర్తయినందున వారుకూడా విధుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.  ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కలిపి…ఆగస్టులో పిల్లల హాజరు 73 శాతంగా ఉందని, సెప్టెంబరులో 82 శాతానికి పెరిగిందని, అక్టోబరు నాటికి 85శాతం నమోదైంది.  ప్రభుత్వం పాఠశాలల్లో హాజరు భారీగా పెరిగిందని, ప్రస్తుతం 91శాతం హాజరు ఉందని  అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ పిల్లల్ని బడిబాట పట్టించాలన్నదే అమ్మ ఒడి పథకం ప్రధాన  ఉద్దేశం.  ఆ దిశగా తల్లులను, పిల్లలను చైతన్యం చేయడానికి అమ్మ ఒడి పథకాన్ని తీసుకు వచ్చాం.  విద్యాకానుకను అమలు చేస్తున్నాం.  వేల కోట్లరూపాయలు ఖర్చుచేసి తొలివిడతలో 15వేలకుపైగా స్కూళ్లు తీర్చిదిద్దాం.  అమ్మ ఒడి స్ఫూర్తి కొనసాగాలి, పిల్లలంతా బడిబాట పట్టాలని అన్ఆరు.  అమ్మ ఒడి పథకం అమలు సందర్భంగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో 75శాతం హాజరు ఉంచాలన్న నిబంధన పెట్టాం. కోవిడ్ పరిస్థితులు కారణంగా ఆ నిబంధనలను అమలు చేయలేని పరిస్థితి నెలకొంది.  రెండేళ్లుగా కోవిడ్ కారణంగా పాఠశాలలు సరిగ్గా నడవని పరిస్థితి ఏర్పడింది.  అమ్మ ఒడి అమలుకు 75 శాతం హాజరు తప్పనిసరి అన్న నిబంధనను మనం పరిగణలోకి తీసుకోలేని పరిస్థితులు వచ్చాయి.  అధికారంలోకి వచ్చిన వెంటనే 2020 జనవరిలో అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించాం, మార్చి చివరి వారంలో కోవిడ్ ప్రారంభం అయ్యింది.  అమ్మ ఒడి అమల్లోకి వచ్చిన 2–3 నెలలు తిరగకముందే కోవిడ్ ప్రారంభం అయ్యింది, స్కూళ్లు మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
తిరిగి 2020, నవంబరు, డిసెంబరుల్లో పాఠశాలలు తెరిచాం.  జనవరి 2021లో మళ్లీ అమ్మ ఒడి ఇచ్చాం, మళ్లీ రెండో వేవ్ కోవిడ్ వచ్చింది.  పరీక్షలే నిర్వహించలేని పరిస్థితులు వచ్చాయి.  ఈ ఏడాది కూడా జూన్లో ప్రారంభం కావాల్సిన స్కూళ్లను ఆగస్టు 16 నుంచి ప్రారంభించాం.  2022 నుంచి ‘అమ్మ ఒడి’ పథకానికి హాజరుకు అనుసంధానం చేయాలి.  పిల్లలను చదువులబాట పట్టించాలన్నదే అమ్మ ఒడి పథకం ఉద్దేశం.  ఈ పథకానికి సంబంధించిన స్ఫూర్తిని మనం కొనసాగించాలి.  75 శాతం హాజరు ఉండాలని ఇదివరకే మనం నిర్దేశించుకున్నాం.  ఈ ఏడాది ఈ నిబంధనను పరిగణలోకి తీసుకోవాలి.  సాధారణంగా జూన్లో స్కూళ్లు ప్రారంభం అయితే ఏప్రిల్వరకూ కొనసాగుతాయి.  కాబట్టి … ఆ విద్యాసంవత్సరంలో పిల్లల హాజరును పరిగణలోకి తీసుకోవాలని అన్నారు.
విద్యాకానుకపైనా సీఎం సమీక్ష
డిసెంబర్ నాటికి వర్క్ ఆర్డర్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.  పిల్లలు స్కూల్కు వెళ్లేనాటికి విద్యాకానుకను వారికి అందించాలని అన్నారు.   విద్యాకానుకలో భాగంగా పిల్లలకు స్పోర్ట్స్ డ్రస్, రెగ్యులర్, స్పోర్ట్స్కి ఉపయోగపడేలా ఉండే షూ
– స్పోర్ట్స్ డ్రస్, షూలను అయన పరిశీలించారు.  ప్రతి స్కూల్కు నిర్వహణ ఖర్చుల కింద కనీసం రూ.1 లక్షను వారికి అందుబాటులో ఉంచాలి.  మరమ్మతులతో పాటు ఏ సమస్య వచ్చినా తీర్చుకునే అవకాశం వారికి ఉంటుంది.  దీనిపై కార్యాచరణ సిద్ధంచేయండని అధికారులకు సీఎం ఆదేశించారు.

Previous articleస్వచ్ఛ వెంకటగిరి , స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ దిశగా అడుగేద్దాం ఎమ్మెల్యే ఆనం
Next articleలాడ్జిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here