కామారెడ్డి సెప్టెంబర్ 30
0 నుండి 18 సంవత్సరాల బాల బాలికల రక్షణ సంరక్షణ ఎలాంటి ఆపదలో ఉన్న పిల్లలు అయిన 1098 కు కాల్ చేసి సహాయపడాలని బస్ స్టేషన్ ప్రయాణికులకు ప్రజలకు అధికారులకు అవగాహన కల్పించడం జరిగింది.
ఇంటి నుండి పారిపోయిన లేదా తప్పిపోయిన పిల్లలను చుసిన, బాల్య వివాహాల గురించి తెలిసిన,బాల్య కార్మికులను చుసిన, వదిలి వేయబడిన పిల్లలను అనాథ పిల్లలను చుసినా, ప్రమాదాల బారినపడి సహాయ సహకారాలు లేక ఇబ్బంది పడుతున్న పిల్లలను చూసినా, ఇరుగు పొరుగు/బడిలో బడి బయట వారి వేధింపులకు మరియు అసభ్య ప్రవర్తన గురించి తెలిసినా లేదా వినినా, నిరాశ్రయులైన పిల్లలను చూసినా,లైంగిక దోపిడీకి గురైన పిల్లలను చూసినా తెలిసినా, పిల్లలకు కుటుంబ సబ్యులనుండి వచ్చే వేధింపులకు,బడి బయటవున్న పిల్లలను బడిలోచేర్చలనుకున్న,ఆనాథ పిల్లలు తల్లి లేదా తండ్రి కోల్పోయిన పిల్లలు ,చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పిల్లలు ఎక్కడైనా కనిపించిన చూసినా 1098 ఉచితంగా ఏ నెట్వర్క్ నుండి అయిన కాల్ చేయవచ్చు అని ప్రయాణికులకు స్థానిక ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో రోజ్ చైల్డ్ లైన్ 1098 జిల్లా ప్రోగ్రాం కో ఆర్డినేటర్ అమృతరాజేందర్, బాలల సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ సత్యనారాయణ, బాల రక్షా భవన్ కో ఆర్డినేటర్ జానకి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి స్రవంతి, చైల్డ్ లైన్1098 కౌన్సిలర్ సౌమ్య, ప్రశాంత్,సురేష్,రవి, షి టీమ్ ప్రతినిదులు సంజీవ్,సౌజన్య అర్ టి సి డిపో మేనేజర్, తదితరులు పాల్గొన్నారు.