రాష్ట్ర మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరు పేద విద్యార్థుల కోసం. అమ్మ ఒడి. విద్యా దీవెన.. వసతి దీవెన. రెండు జతల బట్టలు.. అదే విధముగా వారికి అవసరం ఉందని నోట్ బుక్స్. ఇవ్వడం జరుగుతుంది. ఉపాధ్యాయులకు మాత్రం వేలకొద్దీ వేలు జీతాలు తీసుకుంటూ కక్కుర్తి పాల్పడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు మంచి విద్యాబుద్ధులు నేర్చుకుని పెద్ద పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేసి వారి కాళ్లపై వాళ్ళు నిలబడి తల్లిదండ్రులకు తోడుగా ఉంటారని వారికి ఇంటి వద్ద ఎలాంటి పనులు చెప్పకుండా కాస్తోకూస్తో ఇంట్లొ వండీన తిండి వారికి తినిపించి చి బడికి సాగనంపుతారు.. అక్కడ స్కూల్ క్లాస్ గదిలో చదువుకోవాల్సిన విద్యార్థులు .. ఉపాధ్యాయుల క్యారియర్లు కడగడం.. వారి బైకులు తుడవడం.. వారు తెచ్చుకున్న కార్లు.. బైకులు నీటితో శుభ్రంగా కడిగించుకొవడం. సమయం ఉంటే చీపురుతో ఊడిపీయడం చేయిస్తుంటారు.. వేలకొద్ది జీతాలు తీసుకుంటూ ఉండి కూడా చిన్నారి విద్యార్థులతో వెట్టిచాకిరీ చేయించుకోవడం ఆనవాయితీగా మారిపోయింది.. ఇందుకు నిదర్శనం నందికొట్కూరు నియోజకవర్గం లోని నందికొట్కూరు మండలం కొణిదేల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణములో ప్రధాన ఉపాధ్యాయుల వాహనాన్ని ఒక స్కూల్ విద్యార్థి నీటి పైపు తో శుభ్రం చేస్తూకనిపించడం జరిగింది. అప్పుడేరోడ్డు వెంట వెళ్తున్నటువంటి గ్రామ ప్రజలు విద్యార్థులతో ఉపాధ్యాయులు వెట్టిచాకిరి చేయిస్తున్నారని చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా మండల విద్యాధికారి. లేదా జిల్లా ఉన్నతాధికారులు ఇలాంటి తప్పిదాలు జరగకుండా పిల్లలతో వెట్టిచాకిరి చేయించకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.