Home ఆంధ్రప్రదేశ్ చిల్లకూరు ఎంపీపీ అధ్యక్ష పీఠం వేమారెడ్డి కైవసం సంబరాలు చేసుకున్న వైకాపా నేతలు

చిల్లకూరు ఎంపీపీ అధ్యక్ష పీఠం వేమారెడ్డి కైవసం సంబరాలు చేసుకున్న వైకాపా నేతలు

91
0

నెల్లూరు
నెల్లూరు జిల్లా, చిల్లకూరు మండల పరిషత్ అధ్యక్ష పీఠం వేమారెడ్డి కుమార్ స్వామి రెడ్డి కైవసం చేసుకుని చిల్లకూరు మండల కంచుకోటను వేమారెడ్డి  కుటుంబం కాపాడుకొంది. ఒక్కనొకప్పుడు జిల్లాలో పెద్ద కుటుంబం గా గుర్తింపు తెచుకున్న వేమారెడ్డి కుటుంబం, ఆనాటి పూర్వపు వైభవాన్ని తీసుకొని వచ్చే పనిలో వేమారెడ్డి కుటుంబ వారసుడు వేమారెడ్డి కుమార్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తూ,  చిల్లకూరు మండల పరిషత్ అధ్యక్షపీఠం,జడ్పీటీసీ కైవసం చేసుకొని సత్తా చాటారు.శుక్రవారం చిల్లకూరు మండల పరిషత్ కార్యాలయంలో  రిటర్నింగ్ అధికారులు ఎంపిపి,ఉప ఎంపిపి ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిల్లకూరు మండలంలో వైసీపీ తరుపున గెలుపొందిన 13 మంది ఎంపిటిసి సభ్యులు, వేమారెడ్డి కుమార్ స్వామి ఆధ్వర్యంలో హాజరయ్యారు.అంతకు ముందే వైసీపీ అధిష్టానం పంపిన సీల్డ్ కవర్లు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు చేతులు మీదుగా వేమారెడ్డి అందుకున్నారు.
రిటర్నింగ్ అధికారులు 13 మంది ఎంపిటిసి సబ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించి,సీల్డ్ కవర్ ఓపెన్ చేసి ఎంపిపి,ఉప ఎంపిపి, కో అప్షన్ పేర్లు వెల్లడించారు.విప్ ప్రకారం 13 మంది ఎంపిటిసి  సభ్యులు ఏకగ్రీవంగాచిల్లకూరు ఎంపిపిగా తుపాకుల వెంకట రమణమ్మ, ఉప ఎంపిపిగా వేమారెడ్డి కుమార్ స్వామి రెడ్డిలను ఎన్నుకున్నారు.అనంతరం  ఎంపిపి,ఉప ఎంపిపి ల చేత రిటర్నింగ్ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించి అధికారికంగా పత్రాలు అందజేశారు.
చిల్లకూరు ఎంపిపిగా తుపాకుల వెంకట రమణమ్మ, ఉప ఎంపిపిగా వేమారెడ్డి కుమార్ స్వామి రెడ్డి లు అవ్వడంతో చిల్లకూరు మండలంలో వేమారెడ్డి అభిమానులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. వేమారెడ్డి కుటుంబ వారసుడు కుమార్ స్వామి రెడ్డి అనతి కాలంనే రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అందువలనే పరిషత్ ఎన్నికల్లో 13 ఎంపీటీసీ లు,జడ్పీటీసీ ని కైవసం చేసుకొని వేమారెడ్డి కుటుంబ సత్తా ఏమిటో మరోసారి చాటారు.ఈ కార్యక్రమంలో తిప్పగుంట సర్పంచ్ యల్లాంటి సుకన్య, వైసీపీ నేతలు కొండపల్లి శ్రీనివాసులు రెడ్డి, యల్లాంటి సనత్ కుమార్ రెడ్డి, వేమారెడ్డి అభిమానులు, వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

Previous articleఅరకువేలి ఎంపిపి గా రంజుపల్లి ఉషారాణి
Next articleబారుజోల తారు రోడ్డు పనులు పూర్తి చేయాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here