Home జాతీయ వార్తలు భారత భూభాగంలో అక్రమంగా గ్రామం నిర్మించిన చైనా

భారత భూభాగంలో అక్రమంగా గ్రామం నిర్మించిన చైనా

255
0

న్యూ ఢిల్లీ నవంబర్ 5
చైనా మరోసారి దుర్భుద్ది చూపిస్తోంది. భారత భూభాగంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతోంది. ఇండియా సరిహద్దుల్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో చైనా ఈ గ్రామం నిర్మించింది. అయితే ఇండియా చైనా సరిహద్దుల్లో ఉన్న మెక్ మోహన్ రేఖకు దక్షిణాన ఈ గ్రామం ఆనవాళ్లు కనిపించాయి. . ‘2020లో పీఆర్సీ ఎల్ ఏటీ తూర్పు సెక్టార్ లో టిబెట్ అటానమస్ రీజియన్ భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ ప్రదేశ్ మధ్య ఉన్న వివాదాస్పద భూమిలో చైనా గ్రామాన్ని నిర్మించింది. ఇందులో 100 వరకు ఇళ్లు ఉన్నాయి’ అని అమెరికా రక్షణశాఖ వెల్లడించిన నివేదికలో తెలిపింది. అయితే ఈ గ్రామం ఒకప్పుడు జరిగిన యుద్ధంలో తీవ్రంగా నష్టపోయింది. దీంతో ఈ గ్రామం అప్పటి నుంచి వివాదాస్పందగా ఉంది.ఇప్పటికే సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా తాజాగా మరోసారి రెచ్చగొట్టింది. భారత్ భూభాగంగా పేర్కొంటున్న అరుణాచల్ ప్రదేశ్ లో ఓ గ్రామాన్ని నిర్మించింది. ఈ గ్రామంలో దాదాపు 100 ఇళ్ల వరకు నిర్మించింది. ఇందుకు సంబంధించిన శాటిలైట్ ద్వారా సేకరించిన చిత్రాలను తాజాగా అమెరికా రక్షణశాఖ యూఎస్ కాంగ్రెస్ కు సమర్పించింది. అక్రమంగా భారత భూభాగంలోకి చొచ్చుకు రావడం అక్రమమే అని తెలిసినా నిర్మాణాలను చేపడుతోంది. గత కొన్ని నెలలుగా భారత్ చైనా మధ్య ఉద్రిక్తలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనా వికృత చేష్టలు మరోసారి బయటపడుతుండడంతో ఆ తరువాత ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది.ఇండియా సరిహద్దుల్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో చైనా ఈ గ్రామం నిర్మించింది. అయితే ఇండియా చైనా సరిహద్దుల్లో ఉన్న మెక్ మోహన్ రేఖకు దక్షిణాన ఈ గ్రామం ఆనవాళ్లు కనిపించాయి. . ‘2020లో పీఆర్సీ ఎల్ ఏటీ తూర్పు సెక్టార్ లో టిబెట్ అటానమస్ రీజియన్ భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ ప్రదేశ్ మధ్య ఉన్న వివాదాస్పద భూమిలో చైనా గ్రామాన్ని నిర్మించింది. ఇందులో 100 వరకు ఇళ్లు ఉన్నాయి’ అని అమెరికా రక్షణశాఖ వెల్లడించిన నివేదికలో తెలిపింది. అయితే ఈ గ్రామం ఒకప్పుడు జరిగిన యుద్ధంలో తీవ్రంగా నష్టపోయింది. దీంతో ఈ గ్రామం అప్పటి నుంచి వివాదాస్పందగా ఉంది.అరుణాచల్ ప్రదేశ్ ఎగువన ఉన్న సుబాన్ సిరి జిల్లాలోని సారి చు నది ఒడ్డున ఉంది. అయితే ఈ గ్రామం వివాదంలో ఉన్నా చైనా మాత్రం దశాబ్ద కాలంగా స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 1962 చైనా -ఇండియా యుద్ధం తరువాత విచ్ఛిన్నమైన ఈ గ్రామాన్ని చైనా మళ్లీ నిర్మిస్తోంది. అయితే ఇది ఇరుదేశాల మధ్య ఘర్షణలకు దారితీసే ప్రక్రియే. అయినా చైనా మాత్రం తన దూకుడును ప్రదర్శిస్తోంది. భారత్ చైనా మధ్య దౌత్య సైనిక సంబంధాల విషయంలో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని అవి పూర్తి కాకముందే చైనా ఈ నిర్మాణాలు చేపడుతోందని అమెరికా నివేదిక రూపొందించింది.ఇదే కాకుండా చైనా మరో కుట్రకు పాల్పడుతోంది. పశ్చిమ హిమాలయాల్లోని మారుమూల ప్రాంతాల్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఫైబర్ ఆప్టిక్ నెట్ వర్క్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుందని అమెరికా రక్షణ సంస్థ బయటపెట్టింది. భారత్ సరిహద్దు వెంబడి ఉన్న ఉద్రిక్తలు ఘర్షణల నేపథ్యంలో చైనా ఇలాంటి చర్యలకు పాల్పడి ఉండవచ్చ అని భావిస్తున్నారు. అయితే అంతకుముందు చైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు ఇప్పుడు ఏకంగా గ్రామం నిర్మించడంపై భారత్ లో ఆందోళన వ్యక్తమవుతోంది.
గతంలో చైనా భారత్ భూభాగంలోకి 4.5 కిలోమీటర్ల వరకు చొచ్చుకు రావడమే కాకుండా వితండవాదన చేసింది. ఆ ప్రాంతం తమ భూభాగమేనని ఇది సాధారణ విషయమని వ్యాఖ్యానించింది. ఇది పూర్తిగా తమ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ తెలిపింది. గతంలో భారత్ చైనా సరిహద్దులో ఉన్న డోక్లాం ఘర్షణ స్థావరానికి సమీపంలోనే ఈ గ్రామాన్ని నిర్మించడం విశేషం. అయితే చైనా నిర్మించిన గ్రామం భౌగోళికగా పూర్తిగా భారత్ లోనే ఉన్నా 1959 నుంచి చైనా ఆధీనంలోకి వెళ్లింది. ఈ ప్రాంతంలో ఎప్పుడూ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతాయి. 2019లో ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు లేవు. కానీ తాజాగా 100 ఇళ్ల వరకు చైనా నిర్మించింది. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Previous articleఎస్ఈబి అధికారుల స్పెషల్ డ్రైవ్.. వివరాలు వెల్లడించిన సీపీ శ్రీనివాసులు
Next articleనాల లో అక్రమ లే అవుట్… కుడా .వైస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి అధికారులమీద ఫైర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here