Home అంతర్జాతీయ వార్తలు ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న చైనా !

ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న చైనా !

236
0

న్యూ ఢిల్లీ నవంబర్ 8
ఆర్థిక శక్తిలో అమెరికాకు సవాలు విసురుతున్న చైనా పాలకుల ఆహార కొరత రావచ్చునన్న ఆదేశాలు జారి చేసారు. ఇళ్లల్లో నిల్వలు పెంచుకోండి. ఎవరైనా ఎక్కువగా తిండితినే వీడియోలు ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేస్తే శిక్షిస్తాం అంటూ కఠినమైన నియమాలు విడుదల చేశారు. ఆర్థిక శక్తిలో అమెరికాకు సవాలు విసురుతున్న చైనా పాలకుల ఆదేశాలు. కొవిడ్ శీతాకాలం దృష్ట్యా ఇలా చేస్తున్నాం అని వారు చెబుతున్నారు. వాస్తవానికి దేశ పాలకుల చిన్నచిన్న తప్పుడు నిర్ణయాలు పెను సంక్షోభాన్ని ఎలా సృష్టిస్తాయో కరోనా వ్యాప్తితో ప్రపంచం తెలుసుకొంది. ఆ దేశంలో సమస్య ఎంతో తీవ్రంగా ఉంటేగానీ బాహ్య ప్రపంచానికి తెలిసేలా చిన్నచిన్న ప్రభుత్వ ప్రకటనలు వెలువడవు. తాజా ఆహార సంక్షోభం కూడా అదే కోవకు వస్తుంది.ప్రకృతి ప్రకోపం పాలకుల నిర్ణయాలు కలిసి అక్కడ కృత్రిమ సంక్షోభాలను సృష్టిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత రావొచ్చు. చైనీయులు ముందుగానే సరకులు కొనుగోలు చేసి నిల్వ చేసుకోండి’ అన్నది దీని సారాంశం. పొట్టుతీయని ధాన్యాలు తినడాన్ని ప్రోత్సహించాలని పేర్కొంది. దీంతోపాటు రవాణాలో కొరత కారణంగా పండ్లు కాయగూరలను ఆరబెట్టి నిల్వచేసేందుకు డ్రైయ్యర్లను వినియోగించాలని సూచించింది. కొరతలో ఉన్న ధాన్యాలు కూరగాయలను ఎంచుకొని రైతులు పండించాలని యంత్రాలను వినియోగించి వృథాను కట్టడి చేయాలని పేర్కొంది. బయటకు చెబుతున్న దానికన్నా ఆ దేశంలో సమస్య తీవ్రంగా ఉందన్న విషయాన్ని ఇటీవల పరిణామాలు సూచిస్తున్నాయి.దాదాపు ఏడాదిన్నర నుంచి చైనాలో ఆహార కొరత విషయమై తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ దేశ తీరప్రాంతాల్లో 1000 ఏళ్లల్లో ఎన్నడూ లేనంత స్థాయిలో వరదలు వచ్చాయి. ఫలితంగా పంటలు దెబ్బతిన్నాయి. వాస్తవానికి 2019 నాటికి చైనాలో 23841 డ్యామ్లు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న మొత్తం ఆనకట్టల్లో 41శాతానికి ఇది సమానం. వీటిల్లో అత్యధికంగా 2000 సంవత్సరం తర్వాత నిర్మించినవే. కానీ చైనాలో కుంభవృష్టి వర్షాలు ఎక్కువ అన్న విషయాన్ని మరచిపోయి ఈ ఆనకట్టల్లో నీటిని కిందకి వదల కుండా భారీగా నిల్వ ఉంచుతున్నారు. రాత్రికిరాత్రి కురిసే భారీ వర్షాలకు ఇవి పొంగి పంటలను ఊళ్లను ముంచెత్తుతున్నాయి. గతేడాది త్రీగోర్జెస్ డ్యామ్ కారణంగా సిచువాన్ లో వచ్చిన వరదలే దీనికి నిదర్శనం.ఆహార సమస్య రాబోతోందని చైనా పాలకులే బహిరంగంగా ప్రకటనలు హెచ్చరికలు జారీ చేస్తున్నారంటేనే సమస్య ఎంత స్ధాయిలో అర్ధమైపోతోంది. అయితే రాబోయే శీతాకాలంలో ఆహార కొరత వచ్చే అవకాశం ఉందన్న కారణంగానే తాము ముందుజాగ్రత్తలు చెబుతున్నట్లు పాలకులు సమర్ధించుకుంటున్నారు. చైనాలో ఆహార కొరతకు కారణాలు ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడటం చైనాలో శీతాకాలం ప్రభావం చాలా ఎక్కువగా ఉండటం అని పాలకులు సమర్ధించుకుంటున్నారు. కరోనా వైరస్ తీవ్రత భారీ వర్షాల కారణంగా మొత్తం వ్యవస్ధంతా అస్తవ్యస్ధమైపోయింది. కూరగాయల హోల్ సేల్ రేట్లు రాకెట్ లా దూసుకుపోతున్నాయి. కొన్ని రకాల కూరగాయలను మాంసం కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

Previous articleపవర్ లో ఉన్నామన్న గర్వం మోడీలో ఉంది రైతులు ఆగ్రహించే రోజు రాకూడదు రైతుల విషయం మోడీ సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు తన పదవిని వదులుకోవటానికైనా సిద్ధంగా ఉన్నా మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు
Next articleఉద్యమంలో దాదాపు 750 మంది రైతులు మృతి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ రాకేశ్ తికాయిత్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here