Home జాతీయ వార్తలు సూప‌ర్‌సోనిక్ మిస్సైల్‌ను ప‌రీక్షించిన‌ చైనా..! ఎడిటోరియ‌ల్ ప్ర‌స్తావించిన గ్లోబ‌ల్ టైమ్స్...

సూప‌ర్‌సోనిక్ మిస్సైల్‌ను ప‌రీక్షించిన‌ చైనా..! ఎడిటోరియ‌ల్ ప్ర‌స్తావించిన గ్లోబ‌ల్ టైమ్స్ ప‌త్రిక

108
0

న్యూ ఢిల్లీ అక్టోబర్ 18
చైనా..సూప‌ర్‌సోనిక్ మిస్సైల్‌ను ప‌రీక్షించిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ విష‌యాన్ని చైనాకు చెందిన గ్లోబ‌ల్ టైమ్స్ ప‌త్రిక త‌న ఎడిటోరియ‌ల్ ప్ర‌స్తావించింది. కానీ ధ్వ‌నిక‌న్న వేగంగా వెళ్లే హైప‌ర్‌సోనిక్ క్షిప‌ణిని ప‌రీక్షించిన‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను ఆ ప‌త్రిక క‌న్ఫ‌ర్మ్ చేయ‌లేదు, క‌నీసం ఖండించ‌లేదు కూడా. నిజానికి హైప‌ర్‌సోనిక్ క్షిప‌ణి ప‌రీక్ష‌తో అమెరికా వ్యూహాత్మ‌క నైపుణ్యానికి చైనా బ్రేక్ వేసిన‌ట్లు ఆ ప‌త్రిక‌లో అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. అమెరికా వేగులు కూడా ఆ క్షిప‌ణిని గుర్తించ‌లేక‌పోయిన‌ట్లు గ్లోబ‌ల్ టైమ్స్ తెలిపింది. ఫైనాన్షియ‌ల్ టైమ్స్ ప‌త్రిక త‌న రిపోర్ట్‌లో అణ్వాయుధాలు మోసుకువెళ్లే హైప‌ర్‌సోనిక్ మిస్సైల్ ప‌రీక్ష గురించి వెల్ల‌డించింది. ఆగ‌స్టు నెల‌లో చైనా మిలిట‌రీ ఈ ప‌రీక్ష చేప‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. దిగువ భూక‌క్ష్య‌లో ఈ ప‌రీక్ష సాగిన‌ట్లు చెబుతున్నారు. టార్గెట్‌ను చేధించేందుకు ఆ మిస్సైల్ భూ మండాల‌న్ని మొత్తం చుట్టేసి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. అయితే టార్గెట్‌కు రెండు డ‌జ‌న్ల మైళ్ల దూరంలో మిస్సైల్ ప‌డిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. కానీ అమెరికా ఇంటెలిజెన్స్ మాత్రం ఈ ప‌రీక్ష‌లో ఆశ్చ‌ర్యం ఏమీ లేద‌ని చెబుతోంది.ప్ర‌పంచాన్ని చుట్టిన హైప‌ర్‌సోనిక్ మిస్సైల్ గురించి ఇప్ప‌టి వ‌ర‌కు అమెరికా సైనిక ఇంటెలిజెన్స్ ఎటువంటి కామెంట్ చేయ‌లేదు. ఈ ప‌రీక్ష‌పై చైనా అధికారులు కూడా సైలెంట్‌గా ఉన్నారు. గ్లోబ‌ల్ టైమ్స్ ప‌త్రిక త‌న క‌థ‌నంలో మిస్సైల్ ప‌రీక్ష‌ల గురించి రాసినా.. ప్ర‌స్తుతం హైప‌ర్‌సోనిక్ ప‌రీక్ష జ‌రిగిందా లేదా అన్న అంశంపై మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌రిగే క్షిప‌ణి ప‌రీక్ష‌ల‌ను మానిట‌ర్ చేస్తే సామ‌ర్థ్యం అమెరికాకు ఉన్న‌ట్లు గ్లోబ‌ల్ టైమ్స్ త‌న క‌థ‌నంలో తెలిపింది.సైనిక సాంకేతిక అంశాల్లో అమెరికాకు దీటుగా చైనా ఎదుగుతోంద‌ని గ్లోబ‌ల్ టైమ్స్ త‌న క‌థ‌నంలో చెప్పింది. చైనా త‌న అణ్వాయుధ మిస్సైళ్ల సామ‌ర్థ్యాన్ని కొత్త కొత్త ప‌రీక్ష‌లతో బలోపేతం చేస్తున్న‌ట్లు కూడా అభిప్రాయ‌ప‌డింది. గ్లోబ‌ల్ టైమ్స్ ఎడిటర్ హూ జీజిన్‌ త‌న ట్విట్ట‌ర్‌లో ఈ అంశం గురించి ట్వీట్ చేశారు. అణ్వాయుధ స‌మీక‌ర‌ణ రేసులో చైనాకు ఆస‌క్తి లేద‌న్నారు. కానీ అణ్వాయుధ సామ‌ర్థ్యాన్ని పెంచుకోనున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. అమెరికాను స‌మ‌ర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇది త‌ప్ప‌ద‌న్నారు.చైనా, ర‌ష్యా ప‌రీక్షిస్తున్న హైప‌ర్‌సోనిక్ మిస్సైళ్ల‌తో త‌మ‌కు ప్ర‌మాదం ఉంద‌ని ఇటీవ‌ల అమెరికా ప‌లుమార్లు చెప్పింది. ఇటీవ‌ల ర‌ష్యా త‌న మిలిట‌రీలో.. హైప‌ర్‌సోనిక్ గ్లైడ్ వెహికిల్‌ను ఇంట్ర‌డ్యూస్ చేసింది. దీంతో అమెరికా అప్ర‌మ‌త్త‌మైంది. అయితే ప్ర‌స్తుతం చైనా కూడా హైప‌ర్‌సోనిక్ మిస్సైల్‌ను ప‌రీక్షించ‌డంతో.. అగ్ర‌రాజ్యం అమెరికా ఖంగుతిన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Previous articleన‌ది ఉధృతివ‌ల్ల కొట్టాయం జిల్లాలో కొట్టుకుపోయిన ఇల్లు
Next article19న‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ యాదాద్రి ప‌ర్య‌ట‌న‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here