వేములవాడ
గత కొద్ది నెలలుగా చిరంజీవి నెలకొల్పిన టువంటి చిరంజీవి ఉచిత ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా మొట్టమొదటిసారిగా తెలంగాణలోనే వేములవాడలో స్థాపించి సేవలను అందించడంలో ఉమ్మడి రాష్ట్రాల లోనే వేములవాడ మొదటి స్థానాన్ని సంపాదించుకున్నది అని చెప్పి చిరంజీవి వేములవాడ ప్రతినిధులు మారం ప్రవీణ్ కుమార్ (పప్పీ) దురిశెట్టి అరుణ్ తేజా చార్లను ప్రత్యేకంగా హైదరాబాద్కు పిలిపించుకొని అభినందించారు ఈ సందర్భంగా వేములవాడ లో అభిమానులకు అన్ని విధాల సహకారం చేయడం తో పాటు వివిధ సామాజిక కార్యక్రమాలు చేస్తున్న డాక్టర్ కొండ దేవయ్యసేవలు అభినందనీయమని చిరంజీవి అన్నారు అనంతరం దురిశెట్టి అరుణ్ తేజ చారి మాట్లాడుతూ మాకు ఇంతటి సేవచేసే భాగ్యంకల్పించినందుకు మెగాస్టార్ చిరంజీవి కిరామ్ చరణ్ బాబు రవణం స్వామినాయుడుఅభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల వెంకటేష్ కొండ దేవయ్యలకుకృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కొండ నర్సయ్య ,లిక్కిడి జితేందర్ వర్మ, శీలం విజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు..