నెల్లూరు
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని 31వ డివిజన్ వరద ప్రభావిత ప్రాంతములను నెల్లూరు మునిసిపల్ మేయర్ పొట్లూరి స్రవంతి జయవర్ధన్ మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి లు పరిశీలించారు.
వరదనీరు కాలనీల్లో చేరుకోకుండా జెసిబి సహాయంతో మరమ్మతులు చేపట్టాలని కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తమ సహకారం అందించేందుకు తర్వాత సిద్ధంగా ఉందన్నారు. ఇందుకుగాను సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు అని వారి సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో 31వ డివిజన్ కార్పొరేటర్ బత్తల మంజుల, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు