చిత్తూరు, మా ప్రతినిథి,సెప్టెంబర్ 30
ప్లాస్టిక్ వ్యర్ధాల వల్ల మానవ మనుగడకే ఇబ్బంది వస్తుందని భావించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నివారించడం కోసం నెల రోజుల పాటు నెహ్రూ యువ కేంద్ర ఆద్వర్యంలో నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని జిల్లాలో 10080 కేజీల ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించి నిర్మూలించాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా) రాజశేఖర్ అన్నారు. క్లీన్ ఇండియా, క్లీన్ ఆంధ్రప్రదేశ్ కు సంబందించి అవగాహన కార్యక్రమం గురువారం ఉదయం డి.ఆర్.ఓ సమావేశ మందిరంలో నిర్వహించారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి అయిన సంధర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం మార్చి 12 న నిర్వహించుకున్నామని ఇందులో భాగంగా క్లీన్ ఇండియా, క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని అక్టోబర్ 2 నుండి 31 వరకు వివిధ కార్యక్రమాలను వివిధ సంస్థలు కార్యాలయాలు సమన్వయంతో చేపట్టి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 10,080 కేజీల ప్లాస్టిక్ వేస్ట్ ను సేకరించి నిర్మూలించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో జగనన్న స్వచ్చ సంకల్పం కార్యక్రమం ప్రారంబించనున్నారని, ఈ కార్యక్రమంలో క్లీన్ ఇండియా కూడా చేపట్టాలని ఇందులో భాగంగా అక్టోబర్ 2 వ తేదీన ఎన్.వై. కె ఆద్వర్యంలో ప్లాస్టిక్ వేస్ట్ ను సేకరించాలన్నారు. అదే విధంగా
2, 3 వ తేదీలలో ప్రార్ధన స్థాలాలలో
4,5 వ తేదీలలో కార్పొరేట్ సెక్టార్లు
6,7 వ తేదీలలో క్రీడా కారులు
8,9 వ తేదీలలో రైల్వే సిబ్బంది
10 వ తేదీన పోలీసులు, మీడియా సిబ్బంది
11,12 వ తేదీలలో రాజకీయ నాయకులు
13,14 వ తేదీలలో స్వచ్ఛంద సంస్థలు
18,19 వ తేదీలలో వ్యాపార సంస్థలు
20,21 వ తేదీలలో మహిళా గ్రూపులు
22,23 వ తేదీలలో విధ్యా సంస్థలు
23 వ తేదీన ఫారెస్ట్ సిబ్బంది
25, 26 వ తేదీలలో విద్యా సంస్థలు, ఫారెస్ట్ సిబ్బంది
27, 28 వ తేదీలలో టెలీకామ్ మరియు పోస్టల్ సిబ్బంది
29,30 వ తేదీలలో ప్రభుత్వ రంగ సంస్థలు
31 వ తేదీన నెహ్రూ యువ కేంద్ర మరియు ఎన్.ఎస్.ఎస్ సిబ్బంది చెత్తను సేకరించి గ్రామీణ ప్రాంతాలలో అయితే ఎస్.డబ్ల్యూ.పి.సి ల వద్ద చేర్చాలని పట్టణ ప్రాంతంలో మునిసిపల్ సిబ్బంది కి సమాచారం ఇచ్చి చేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల వారు సమన్వయంతో పని చేసి జిల్లాలో ప్లాస్టిక్ లేకుండా చూసే బాధ్యత తీసుకోవాలన్నారు. వాలంటీర్ల నుండి అధికారుల వరకు ప్లాస్టిక్ వల్ల కలిగే అనార్ధాల గురించి అందరికీ వివరించాలని అన్నారు. నెహ్రూ యువ కేంద్ర కో ఆర్డినేటర్ ప్రదీప్ ఆద్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జె.సి (ఆసరా) తో పాటు డి.ఆర్.ఓ మురళి, జెడ్పీ.సి.ఈ.ఓ ప్రభాకర్ రెడ్డి, డి.పి.ఓ దశరధ రామి రెడ్డి, డి.ఆర్.డి.ఎ.పి.డి తులసి, మెప్మా పి.డి రాదమ్మ, నగర పాలక కమిషనర్ విశ్వనాధ, స్పొర్ట్స్ అథారిటీ సయ్యద్, డి.ఎస్.పి.సి.సి.ఎస్ .శ్రీనివాస మూర్తి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.