పెద్దపల్లి సెప్టెంబర్ 21
సింగరేణిలోని11 ఏరియాలలో ఖాళీగా ఉన్న క్లరికల్ ఉద్యోగాలను ముందుగా ఇంటర్నల్ అభ్యర్థులతో భర్తీ చేయాలని సింగరేణి బదిలీ వర్కర్స్ మజ్దూర్ ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం గోదావరిఖనిలో ఒక ప్రకటన విడుదల చేశారు. సింగరేణి వ్యాప్తంగా డిగ్రీ, పీజీలు చదివిన యువ కార్మికులు, ఇంటర్నల్ అభ్యర్థులు సుమారు ఐదు వేల మంది వరకు ఉన్నారని, కంపెనీ నియమనిబంధనల ప్రకారం మొదటగా ఇంటర్నల్ అభ్యర్థులకు పరీక్ష నిర్వహించిన తర్వాత ఎక్స్టర్నల్ నిర్వహించాలని అన్నారు. దాదాపుగా మూడు సంవత్సరాల నుండి ఐదు వేల మంది ఇంటర్నల్ అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారని డైరెక్టర్ పా ప్రత్యేక చొరవ తీసుకుని మొదటగా ఇంటర్నల్ అభ్యర్థులకు పరీక్ష నిర్వహించాలని సింగరేణి బదిలీ వర్కర్స్ మజ్దూర్ ఫోరమ్ తరఫున కోరుతున్నామన్నారు. అదేవిధంగా మందమర్రి ఏరియాలో సర్ఫేస్ మజ్దూర్ల ఎంపిక విషయంలో పారదర్శకంగా వ్యవహరించి అర్హులకు న్యాయం జరిగే విధంగా చూడాలని పేర్కోన్నారు. అలాగే సింగరేణి ఆసుపత్రుల్లో ఫార్మసిస్ట్ ఖాళీలను కూడా ఇంటర్నల్ అభ్యర్థులకు అవకాశం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి బదిలీ వర్కర్స్ ఫోరం అధ్యక్షులు కొప్పుల శ్రీనాథ్, వ్యవస్థాపక అధ్యక్షులు చెల్పూరి సతీష్, సాదుల సంతోష్, నాయకులు బొగ్గుల సాయి కృష్ణ, జితేందర్ రెడ్డి, రవి యాదవ్, తిరుపతి నాయక్, సలీం,విక్రమ్, గంగుల సతీష్ తదితరులు ఒక ప్రకటనలో కోరారు.