Home ఆంధ్రప్రదేశ్ ఆ మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ ఈ నెల 7న ఆకౌంట్లోలో నగదు...

ఆ మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ ఈ నెల 7న ఆకౌంట్లోలో నగదు జమ

96
0

అమరావతి
స్వయం సహాయ సంఘాల మహిళలకు(డ్వాక్రా మహిళలకు) ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆసరా పథకం రెండో విడత నిధుల్ని సీఎం జగన్ ఈ నెల 7న స్వయం డ్వాక్రా మహిళల అకౌంట్లలో జమ చేయనున్నారు.సీఎం క్యాంపు ఆఫీసు నుంచి ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి ఈ మొత్తాలను మహిళల ఖతాలకు బదిలీ చేయనున్నారు. నిధులు కొరత ఉండటంతో గత నెలలో చేపట్టాల్సిన ఈ పథకాన్ని గవర్నమెంట్ అక్టోబరు 7కి వాయిదా వేసింది. వైఎస్సార్ ఆసరా పథకంలో భాగంగా 8 లక్షల 42 వేల డ్వాక్రా సంఘాల్లోని 78 లక్షల 75 వేల 599 మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఈ మేరకు రూ. 6470 కోట్లను మహిళల అకౌంట్లలో ప్రభుత్వం జమ చేయనుంది. ఎన్నికల హామీ మేరకు 2019 ఏప్రిల్ 11వ తేదీ ముందు వరకూ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ప్రభుత్వం చెల్లిస్తుందంటూ సీఎం జగన్ ప్రకటించారు. ఈ మేరకు మొత్తం రూ. 25,579 కోట్ల రుణాలను నాలుగు విడతల్లో డ్వాక్రా సంఘాల మహిళలకు చెల్లించాలని గవర్నమెంట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటి విడతగా గత ఏడాది సెప్టెంబరు 11న రూ. 6330 కోట్ల మొత్తాన్ని డ్వాక్రా మహిళల అకౌంట్లలోకి నగదు బదిలీ రూపంలో ప్రభుత్వం చెల్లించింది.ఈ ఏడాది కూడా సెప్టెంబరు నెలలోనే చెల్లించాలని భావించినా..నిధులు కొరత ఉండటంతో ఆసరా రెండో విడత అమలును అక్టోబరు 7కు వాయిదా వేశారు. ప్రస్తతం వైఎస్సార్ ఆసరా రెండో విడత మొత్తాన్ని ఈ నెల 7న చెల్లించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. రెండో విడత డబ్బుల పంపిణీ చేపట్టనుండటంతో విస్తృత అవగాహన, ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌ వెల్లడించారు. పథకం ద్వారా లబ్ధి పొందే మహిళలు తమ జీవనోపాధులు పెంపొందించుకునేందుకు ఆలోచన చేస్తే… అదనంగా బ్యాంకు లోన్స్ ఇప్పించేలా సెర్ప్‌ సిబ్బంది తోడ్పాటు అందిస్తారని తెలిపారు.

Previous articleఐపీఎల్ కొత్త టీమ్ 4000 కోట్లు!
Next articleఫెస్ బుక్ సేవలు ఎందుకు నిలిచి పోయాయి!?.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here