అమరావతి
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి గురువారం నాడు తన క్యాంపు కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఎస్బి అంజాద్ బాషా, ఎమ్మెల్సీ మహమ్మద్ కరీమున్నిసా, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్ పాల్గొన్నారు