Home ఆంధ్రప్రదేశ్ కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలను సమర్పించిన సిఎం జగన్

కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలను సమర్పించిన సిఎం జగన్

287
0

విజయవాడ అక్టోబర్ 12
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెజవాడ కనకదుర్గమ్మను మంగళవారం దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో అర్చకులు.. సీఎంకు స్వాగతం పలికారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూలానక్షత్రం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సీఎం సమర్పించారు. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం అంతరాలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు సీఎంకు పరివట్టం కట్టి తలపాగా చుట్టారు. పట్టు వస్త్రాలను సీఎం తలపై పెట్టగా వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య వైఎస్‌ జగన్‌.. దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నారు. సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. సీఎం జగన్ తో పాటు దుర్గమ్మను దర్శించుకున్న వారిలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని,  పేర్ని నాని, కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

Previous articleజమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
Next articleలావుడియా జీవన్ లాల్ కు ఘన సత్కారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here